Begin typing your search above and press return to search.

గాల్లో ఎగురుకుంటూ వెళ్లి ఎగ్జామ్ హాల్ వద్ద దిగాడు... వీడియో వైరల్!

మహారాష్ట్రలోని సతారా జిల్లాకు వాయ్ తాలూకాలోని పసరాని గ్రామానికి చెందిన సమర్త్ మహాంగడే అనే విద్యార్థి ట్రాఫిక్ ను తప్పించుకొని పరీక్షలకు సమయానికి చేరుకోవడం కోసం పారాగ్లైడింగ్ ను ఎంచుకున్నాడు.

By:  Tupaki Desk   |   16 Feb 2025 2:30 PM GMT
గాల్లో ఎగురుకుంటూ వెళ్లి ఎగ్జామ్ హాల్  వద్ద దిగాడు... వీడియో వైరల్!
X

పరీక్షల సమయంలో అన్ని రకాల టెన్షన్స్ ఒకెత్తు అయితే.. సమయానికంటే ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా వెనక్కి పంపించేస్తారనే టెన్షన్ మరొకెత్తు అని అంటుంటారు. అలాంటి ఒత్తిడి ఉందో ఏమో కానీ... పరీక్షా కేంద్రానికి గాల్లో ఎగురుకుంటూ వెళ్లాడు ఓ విద్యార్థి. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... మహారాష్ట్రలోని సతారా జిల్లాకు వాయ్ తాలూకాలోని పసరాని గ్రామానికి చెందిన సమర్త్ మహాంగడే అనే విద్యార్థి ట్రాఫిక్ ను తప్పించుకొని పరీక్షలకు సమయానికి చేరుకోవడం కోసం పారాగ్లైడింగ్ ను ఎంచుకున్నాడు. తాను పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి సమయం తక్కువ ఉందని గ్రహించి ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడట.

వాస్తవానికి... సమర్థ్ తన పరీక్ష రోజున వ్యక్తిగత పనిమీద పంచగనిలో ఉన్నాడట. ఈ సమయంలో వై-పంచగని రోడ్డులో భారీ ట్రాఫిక్ లో చిక్కుకుంటానని గ్రహించిన అతడు.. ఈ అసాధారణ మార్గాన్ని ఎంచుకున్నాడని.. పారాగ్లైండింగ్ ద్వారా నేరుగా తన గమ్యస్థానానికి చేరుకున్నాడని తెలుస్తోంది.

ఈ సమయంలో... పంచగనిలోని జీపీ అడ్వెంచర్ నుంచి సాహస క్రీడా నిపుణుడు, అతని బృందం ఫ్లైట్ ఏర్పాటు చేసి అతను.. కళాశాల సమీపంలో సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేలా చూసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోలో సమర్థ్ తన కాలేజీ బ్యాగును పట్టుకుని ఆకాశంలో ఎగురుతూ తన పరీక్షా కేంద్రం దగ్గర దిగుతున్నట్లు కనిపిస్తుంది.