Begin typing your search above and press return to search.

వైరల్ ఇష్యూ... స్టూడెంట్‌ రాక్‌.. టీచర్ షాక్‌!

పలు సందర్భాల్లో కొంతమంది ఆకతాయి విద్యార్థులు పరీక్షల్లో అడిగిన ప్రశ్నలకు బదులు రకరకాల సమాధానాలు రాస్తుంటారు

By:  Tupaki Desk   |   21 Jun 2024 11:30 AM GMT
వైరల్ ఇష్యూ... స్టూడెంట్‌ రాక్‌.. టీచర్ షాక్‌!
X

పలు సందర్భాల్లో కొంతమంది ఆకతాయి విద్యార్థులు పరీక్షల్లో అడిగిన ప్రశ్నలకు బదులు రకరకాల సమాధానాలు రాస్తుంటారు. ఇందులో భాగంగా కొంతమంది సినిమా స్టోరీలు, పాటలు రాస్తే.. మరికొంతమంది సమాధానాలు రాకపోయినా మార్కులు వేయమని రిక్వస్ట్ లు చేస్తుంటారు. వీటికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా ఒక హార్ట్ బొమ్మ వైరల్ గా మారింది.

అవును... తాజాగా పరీక్షలో ఓ విద్యార్థి రాసిన జవాబును చూసి టీచర్‌ షాక్‌ అయ్యారట. ఇందులో భాగంగా సదరు విద్యార్థి.. "గుండె బొమ్మ వేసి, దాని పనితీరును రాయండీ" అని అడిగిన ప్రశ్నకు చేసిన విన్యాశాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఈ క్రమంలో... ఆ విద్యార్థి గుండె బొమ్మను చక్కగా వేసి, అందులోని నాలుగు గదులు (రెండు కర్ణికలు, రెండు జటరికలు)ను ఐదుగురు అమ్మాయిలతో నింపి.. తన పరిస్థితిని వివరించాడు.

ఈ సందర్భంగా ఆ భాగాలకు హరిత, ప్రియ, పూజ, రూప, నమిత అని ఐదు పేర్లు కూడా రాశాడు. అనంతరం వారి పై తనకున్న బంధం, అభిప్రాయాలను వివరించాడు. అంటే... గుండేలోని భాగాల పనీతీరు వివరణ అన్నట్లుగా అన్నమాట. ఈ సందర్భంగా ఐదుగురు అమ్మాయిల పేర్లు రాస్తూ.. వారి గురించి సింగిల్ లైన్ స్టేట్ మెంట్స్ ఇచ్చాడు.

ప్రియ: నాతో ఇన్ స్టాగ్రాం లో చాట్ చేస్తుంది.. ఆమె అంటే నాకు ఇష్టం!

రూప: స్నాప్ చాట్ లో నాతో టచ్ లో ఉంటుంది.. అందంలో ఆమెకు ఎవరూ సాటి రారు.

నమిత: పొరుగింట్లో ఉండే ఈమె పొడవాటి జిట్టు, పెద్ద పెద్ద కళ్లు కలిగి ఉంటుంది.

పూజ: నా మాజీ ప్రేమికురాలు.. ఆమెను ఎప్పటికీ మరిచిపోలేను.

హరిత: నా క్లాస్ మెట్.. ఆమెనూ ఇష్టపడుతున్నాను.

దీంతో... ఈ క్రియేటివిటీకి సంబంధించిన సమాధానం చదివిన టీచర్.. తొలుత షాక్ తిని, అనంతరం కాస్త తేరుకుని, గుండె బొమ్మకు మాత్రం మార్కులు వేశారు. అనంతరం ఈ క్రియేటివ్ జీనియస్ ని పిలిచి.. పేరెంట్స్ ని స్కూలుకు తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పొస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. సదరు విద్యార్థి రాసిన జవాబును చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు.

దీంతో... ఈ పోస్ట్ కి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సదరు విద్యార్థి పెర్ఫార్మెన్స్ కి పలువురు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే... పేరెంట్స్ స్కూల్ కి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అనే విషయంపైనా కామెంట్లు చేస్తున్నారు.