Begin typing your search above and press return to search.

వద్దంటున్న అమెరికా..? రమ్మంటున్న దక్షిణ కొరియా..

అమెరికా సైతం ఏటా భారతీయ విద్యార్థులకు రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉంది.

By:  Tupaki Desk   |   4 Sep 2024 8:30 PM GMT
వద్దంటున్న అమెరికా..? రమ్మంటున్న దక్షిణ కొరియా..
X

యూఎస్‌లో చదువుకునేందుకు.. అక్కడ ఉద్యోగం చేసేందుకు భారతీయులు నిత్యం వేలాది సంఖ్యలో తరలుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అమెరికా ఏటా వీసాల సంఖ్య కూడా పెంచుతూ వస్తోంది. 2022-23 విద్యాసంవత్సరంలో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారత విద్యార్థుల సంఖ్యలో దాదాపు 35శాతం అధికంగా నమోదైంది. మన దగ్గరి చదువులతో పోలిస్తే.. అక్కడ ఏ చదువుకు అయినా ఖర్చు కాస్త ఎక్కువే. అయినప్పటికీ అక్కడే స్థిరపడాలనే ఆలోచన.. అక్కడ ఉద్యోగం వస్తే లైఫ్‌లో సెటిల్ అయిపోవచ్చని భవిష్యత్ ప్లాన్‌తో అటు మొగ్గు చూపుతున్నారు.

అమెరికా సైతం ఏటా భారతీయ విద్యార్థులకు రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉంది. ఆసక్తిగా తమ దేశానికి ఆహ్వానిస్తోంది. అక్కడే చదివిన విద్యార్థులు అక్కడే ఉద్యోగాలు చేస్తుండడం.. మన వాళ్ల సేవలు క్వాలిటీగా ఉండడంతో అమెరికా ఉపాధి అవకాశాలు సైతం మరింత మెరుగయ్యాయి. 2023లో యూఎస్‌లోని భారతీయ విద్యార్థులు అక్కడి ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించారట. మనవారితో ఉద్యోగ ఖాళీలను పూరించడం ద్వారా ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు సైతం గణనీయంగా పెరిగింది.

కట్‌ చేస్తే.. ఇప్పుడంతా సీన్ రివర్స్. ఒకప్పుడు భారత విద్యార్థులతో తమ దేశానికి ఆదాయం అనుకున్న ఆ దేశం ఇప్పుడు వారిని వద్దనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇమ్మిగ్రేషన్ విధానంలో చేసిన మార్పులే ఇందుకు నిదర్శనంగా చెప్పాల్సి వస్తోంది. దీనికితోడు పెరుగుతున్న గృహ ఖర్చులు, ఉద్యోగ మార్కెట్ ఒత్తిళ్లు, సామాజిక అశాంతి కఠినతరమైన నిబంధనలకు అడ్డుగా నిలుస్తున్నాయి. కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో పోలీస్తే యూఎస్ కఠిన నియమాలు, అధిక ఖర్చులను విధించింది. దీని ఫలితంగా చాలా వరకు వీసాలను తిరస్కరణకు గురవుతున్నాయి.

అయితే.. అమెరికా కూడా భారత విద్యార్థుల వీసాలను తిరస్కరిస్తే అది ఆ దేశానికే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు అంటున్నారు. గణనీయమైన ఆర్థిక నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత కూడా వస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం అమెరికాకు దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. కానీ.. ఆ దేశం నుంచి తిరస్కరణ వస్తుండడంతో ఆ దేశానికి కాకుండా విద్యార్థులు మరో దేశాన్ని ఎంచుకునే ప్రమాదం లేకపోలేదు. తైవాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా వంటి దేశాలు భారత విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి.