Begin typing your search above and press return to search.

సెలవు కోసం మదర్సాలో చదివే 5ఏళ్ల పిల్లాడ్ని చంపేసిన మిగిలిన పిల్లలు

ఈ ఉదంతం గురించి సమాచారం తెలుసుకున్నంతనే పోలీసులు సైతం షాక్ తిన్న పరిస్థితి.

By:  Tupaki Desk   |   26 Aug 2024 4:37 AM GMT
సెలవు కోసం మదర్సాలో చదివే 5ఏళ్ల పిల్లాడ్ని చంపేసిన మిగిలిన పిల్లలు
X

ఐదారేళ్ల చిరుప్రాయంలో చంపేయాలన్నంత దారుణ ఆలోచనలు అసలు వస్తాయా? అన్న ఆశ్చర్యపోవచ్చు. చుట్టూ ఉన్న వాతావరణం.. అందుబాటులో ఉన్న కంటెంట్.. టీవీల్లో వచ్చే కొన్ని నేర సీరియళ్లు.. ఓటీటీలో విచ్చలవిడిగా ఉండే క్రైం సాహిత్యం. ఇవి సరిపోతాయి కదా పసి మనసుల్లోకి విష ఆలోచనలు వచ్చేయటానికి. అలాంటి దుర్మార్గానికి.. తాము చదువుతున్న బడి (మదర్సా)కు సెలవు రావాలంటే.. స్కూల్లో పిల్లాడు చనిపోతే వస్తుందన్న ఆశతో ఐదేళ్ల పిల్లాడ్ని చంపేశారు స్కూల్ పిల్లలు.

ఈ ఉదంతం గురించి సమాచారం తెలుసుకున్నంతనే పోలీసులు సైతం షాక్ తిన్న పరిస్థితి. ఇంతకూ ఎందుకు హత్య చేశారు? అలాంటి పాడు ఆలోచనలు ఎలా వచ్చాయి? అన్న ప్రశ్నలు వేస్తే.. వారి నుంచి వచ్చిన సమాధానం ఏమిటో తెలుసా.. టీవీలో వచ్చే క్రైం షోను ఫాలో అయినట్లుగా చెప్పటంతో.. ఏం మాట్లాడలేని పరిస్థితి పోలీసుల్లో నెలకొన్నట్లు చెబుతున్నారు.

దేశ రాజధాని న్యూఢిల్లీలోని దయాళ్ పూర్ ఏరియాలోని ఒక మదర్సాలో ఈ పాడు ఘటన చోటు చేసుకుంది. మదర్సాలో చదివే ఐదేళ్ల పిల్లాడ్ని.. తొమ్మిది.. పదకొండేళ్ల పిల్లలు ఇద్దరు.. తాము చదివే మదర్సాకు సెలవు ఇస్తే.. ఇంటికి వెళ్లొచ్చన్న దుర్మార్గంతో.. తమ మదర్సాలో చదివే ఐదేళ్ల పిల్లాడ్ని కొట్టి చంపేశారు. ఈ విషయాన్ని పిల్లలు ఇద్దరు ఒప్పేసుకున్నారు. పసి మనసుల్ని కలుషితం చేస్తున్న టీవీ సీరియళ్లు.. రానున్న రోజుల్లో మరెన్ని విపరిణామాలకు కారణమవుతుందన్న ఆలోచనే వణికేలా చేస్తుంది కదూ?