Begin typing your search above and press return to search.

ఆరాచక ‘బంగ్లా’: హీరోను అతని తండ్రిని కొట్టి చంపేశారు

బంగ్లాదేశ్ చిత్రాల్లో హీరోగా నటించే నటుడు శాంటోఖాన్. అతని తండ్రి నిర్మాతగా వ్యవహరిస్తుంటారు.

By:  Tupaki Desk   |   6 Aug 2024 5:05 AM GMT
ఆరాచక ‘బంగ్లా’: హీరోను అతని తండ్రిని కొట్టి చంపేశారు
X

ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటాను తీసుకొచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు దారుణ పరిస్థితులు ఎదురుకావటమే కాదు.. ఆమె పదవి నుంచి తప్పుకొని భారత్ కు వచ్చేయాల్సిన దుస్థితి. ఇదిలా ఉండగా కల్లోల బంగ్లాలోఅరాచక ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. వేలాది మంది ఆందోళకారులు రోడ్ల మీదకు వచ్చి విద్వంసాన్ని క్రియేట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి.. చీఫ్ జస్టిస్ నివాసాల్ని మాత్రమే కాదు.. పార్లమెంట్ భవనంలోనూ ధ్వంసకాండ సాగింది. కొద్ది నెలల క్రితం శ్రీలంకలో చోటు చేసుకున్న ఘటనలే బంగ్లాదేశ్ లోనూ రిపీట్ అయ్యాయన్నట్లుగా పరిస్థితి ఉంది. కాకుంటే.. రాజకీయ నాయకుల్నే కాదు.. వివిధ రంగాలకు చెందిన పలువురిని ఆందోళనాకారులు టార్గెట్ చేయటం.. కొందరిని హతమార్చటం లాంటి అరాచకాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఐదు అరాచక ఘటనల్ని చూస్తే..

1. సినీ హీరో.. అతని తండ్రి (నిర్మాత) హత్య

బంగ్లాదేశ్ చిత్రాల్లో హీరోగా నటించే నటుడు శాంటోఖాన్. అతని తండ్రి నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. ఆందోళనల్లో భాగంగా చాంద్ పూర్ జిల్లా బగారాబజార్ లో ఉంటున్న అతని ఇంటి వద్దకు వచ్చి.. ఇంటిని తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులపై కాల్పులు జరిపి.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనాకులు ఈ ఇంటిని చుట్టుముట్టి.. వీరిని కర్రలతో కొట్టి చంపేశారు.


2. ఇద్దరు క్రికెటర్ల ఇళ్లకు నిప్పు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జాతీయ క్రికెటర్లకు నిరసన సెగ తప్పలేదు. ఢాకా నగరంలో నివాసం ఉంటున్న మాజీ క్రికెటర్ కం ఎంపీ మష్రఫే మొర్తుజా, నజ్ముల్ హసన్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు అంటించారు.


3. హోం మంత్రి ఇంటికి నిప్పు..జాతిపిత విగ్రహాం నేలమట్టం

ఆందోళకారులు హోంమంత్రిఅసదుజ్జమాన్ ఖాన్ కమాల్ ఇంటికి నిప్పు పెట్టారు. అంతేకాదు.. బంగ్లాదేశ్ జాతిపిత.. షేక్ హసీనా తండ్రి.. బంగ్లాదేశ్ లిబరేషన్ నాయకుడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ భారీ విగ్రహం మీదకు ఎక్కి.. చెప్పుల దండ వేయటమే కాదు.. సదరు భారీ విగ్రహం పైకి ఎక్కిన ఆందోళనాకారులు తల భాగాన్ని సుత్తితో కొట్టారు. పాక్షికంగా ధ్వంసం చేశారు. సోమవారం రాత్రి ఏడున్నర గంటల వేళలో బుల్డోజర్ తో తిరిగి వచ్చిన ఆందోళనాకారులు ఆ విగ్రహాన్ని నేలమట్టం చేశారు. అవామీ లీగ్ ఆఫీసును.. బంగబంధు మ్యూజియాన్ని.. ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ కు నిప్పుపెట్టారు. బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి ఇంట్లోనూ విధ్వంసాన్ని క్రియేట్ చేవారు. ఢాకా ఎయిర్ పోర్టును ఆరు గంటల పాటు మూసేశారు.


4. స్టార్ హోటల్ కు నిప్పు.. 13 మంది సజీవ దహనం

జెస్సోర్ జిల్లాలోని అవామి లీగ్ ప్రధాన కార్యదర్శి షహీన్ చక్లాదర్ కు ఒక స్టార్ హోటల్ (హోటల్ జబీర్ ఇంటర్నేషనల్) ఉంది. 14 అంతస్తుల్లో ఉండే ఈ హోటల్ కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఉదంతంలో హోటల్ లో ఉన్న 13 మంది సజీవ దహనమయ్యారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో హోటల్ పై నుంచి కిందకు దూకేసిన 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. హోటల్ లో ఇంకెంతమంది ఉన్నారన్నది తెలియరాలేదు.


5. ఎస్ఐను కొట్టి చంపేశారు

చాంద్ పూర్ జిల్లాలోని కచువా.. మత్తౌచ్.. మత్లౌచ్.. హెమ్చార్.. ఫరీద్ గంజ్ పోలీసుస్టేషన్ల పై ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా కచువా ఎస్ఐను కొట్టి చంపారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 20ఏళ్ల షహదత్ అనే విద్యార్థి మరణించాడు. మరో విద్యార్థి (ఇమ్రాన్ హుస్సేన్) పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.