బిడ్డల ఆకలి తీర్చడం కోసం... సైనికుల లైంగిక వాంఛలు తీరుస్తున్నారు!
అవును... పట్టేడన్నం కోసం మహిళలు భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్న ఓ దారుణ విషయం తాజాగా తెరపైకి వచ్చింది
By: Tupaki Desk | 23 July 2024 1:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఎన్నో దారుణ ఘటనలు తెరపైకి వస్తుంటాయి. ఇక ప్రధానంగా బాగా వెనుకబడిన దేశాలు, నియంత పాలనలో ఉన్న రాజ్యాల్లో ప్రజల పాట్లు హృదయవిధారకంగా ఉంటాయి. ఈ రోజుల్లోనే ఉన్నారా? అనే చర్చా తెరపైకి వస్తుంటుంది. ఈ సమయంలో కడుపున పుట్టిన బిడ్డల ఆకలి తీర్చడం కోసం సైనికుల లైంగిక వాంఛలు తీర్చే దారుణ పరిస్థితుల్లో ఉన్న మహిళ విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... పట్టేడన్నం కోసం మహిళలు భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్న ఓ దారుణ విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా తమపై ఆధారపడిన వృద్ధ తల్లితండ్రులు, కడుపున పుట్టిన బిడ్డల ఆకలి తీర్చడం కోసం సైనికుల లైంగిక చాంఛలు తీర్చే దయణీయ పరిస్థితిని ఎదుర్కోంటున్నారు కొందరు మహిళలు. తాజాగా ‘ది గార్డియన్ పత్రిక’ ఈ వ్యవహారంపై ఓ కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనం ప్రకారం... ఆఫ్రికా దేశమైన సూడాన్ లోని ఒమ్దుర్ మన్ సిటీలో గత ఏడాది ఏప్రిల్ లో అంతర్యుద్ధం మొదలైంది. ఆ సమయంలో ఆ పట్టణంలోని చాలామంది ఇతర ప్రాంతాలకు పారిపోయారు. అయితే... సుమారు 24 మంది మహిళలు మాత్రం వారి వారి కుటుంబాలతో సహా అక్కడే చిక్కుకుపోయారు. ఈ సమయంలో.. అక్కడ సైనికుల వద్ద మాత్రమే ఆహారం లభిస్తోంది.
దీంతో... తమ తమ ఇళ్లల్లోని వృద్ధ తల్లితండ్రులు, పిల్లలకు ఫ్యాక్టరీల్లో నిల్వ ఉంచిన ఆహారం తీసుకొనేందుకు వచ్చిన మహిళలను సైనికులు వేదిస్తున్నారు. ఇందులో భాగంగా.. అక్కడున్న సైనికుల లైంగిక వాంఛలు తీరిస్తేనే వారికి ఆహారం అందిస్తున్నారని బాధిత మహిళలే స్వయంగా మీడియాకు వెళ్లడించారని ది గార్డియన్ పత్రిక వెల్లడించింది.
సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య చెలరేగిన ఘర్షణ ఈ సివిల్ వార్ కు దారి తీయగా... ఈ రెండు వర్గాల నుంచి తమకు లైంగిక వేధింపులు తీవ్రంగా ఉంటున్నాయని అక్కడ మహిళలు గగ్గోలు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితి పగవాళ్లకు కూడా రావొద్దని వారు వాపోతున్నారు. కేవలం బిడ్డల ఆకలి తీర్చడానికే వారు చెప్పినట్టెల్లా చేయాల్సి వస్తుందని బాధిత మహిళలు వాపోతున్నారని చెబుతున్నారు.
ఈ క్రమంలో ఒక్కో బాధిత మహిళదీ ఒక్కో కథ! ఇందులో భాగంగా తన వృద్ధ తల్లితండ్రులకు, తన 18ఏళ్ల కుమార్తెకు ఆహారం కోసం సైనికుల కోరిక తీర్చడం తప్ప తనకు వేరే మార్గం లేదని ఓ బాధిత మహిళ వాపోయారు. ఎదిగిన తన కుమార్తెను ఆహారం కోసం బయటకు పంపడం లేదని.. తన తల్లితండ్రులు ఇద్దరూ చాలా వృద్ధులని, పైగా అనారోగ్యంతో ఉన్నారని ఆమె తెలిపారు.
ఇదే సమయంలో... పశ్చిమ ఓందుర్మాన్ లో ఖాళీగా ఉన్న ఇళ్లలో సామానులు తెచ్చుకునేందుకు అనుమతించినందుకు ప్రతిఫలంగా తాను సైనికులతో లైంగిక చర్యలో పాల్గొనవలసి వచ్చిందని 21 ఏళ్ల యువతి తెలిపింది. అనంతరం తాను అంగీకారం తెలపనందుకు వారిలో ఇద్దరు తనను పట్టుకుని రెండు కాళ్లూ కాల్చారని ఆ మహిళ తెలిపింది. ఇలాంటి హింసలు ఇక్కడ సహజం అయిపోయాయని వాపోయింది.
ఇక ఐక్యరాజ్యసమితి వెల్లడించిన వివరాల ప్రకారం... సూడాన్ లో జరిగిన ఘర్షణల్లో సుమారు పదివేల మంది మరణించగా.. దాదాపు 10 మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇదే క్రమంలో సుమారు 26 మిలియన్ల మంది అంటే జనాభాలో సగానికి పైగా ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని నివేదించింది.
ఇదే సమయంలో... దేశవ్యాప్తంగా ఎంతో అవసరం ఉన్న ఆహార సరఫరా చేయడానికి సహాయ సంస్థలు, ఐక్యరాజ్య సమితి చాలా కష్టపడుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఇటీవలే కార్టూం ప్రాంతానికి డెలివరీలు చేసినట్లు చెబుతున్నారు. అయితే... తమ సమస్యలు చెప్పుకున్న మహిళలు మాత్రం... అంతర్జాతీయ సహాయం తమకు ఏదీ అందలేదని, తాము చూడలేదని తెలిపినట్లు చెబుతున్నారు.