అబ్దుల్ కలామ్ ఫోన్ చేస్తే సుధా మూర్తి ఏమ్మనారో తెలుసా?
ఆమె జీవన శైలి ఎందరికో మార్గదర్శకం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
By: Tupaki Desk | 26 Jun 2024 11:30 AM GMTఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేరు చెప్పిన వెంటనే గుర్తుకు వచ్చే మరో పేరు ఆయన సతీమణి సుధామూర్తి. కేవలం నారాయణమూర్తి భార్యగా మాత్రమే కాకుండా.. ఒక రచయిత్రగా ఆమె అందరకు ఇన్స్పిరేషన్. ఏ విషయం పైనైనా అనర్ఘలంగా మాట్లాడడం సుధా మూర్తికి వెన్నతో పెట్టిన విద్య. కోట్ల ఆస్తికి అధిపతి అయి కూడా ఆమె ఎంతో సాధారణమైన వస్త్రధారణతో ఉంటారు. ఆమె జీవన శైలి ఎందరికో మార్గదర్శకం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
తాజాగా సుధామూర్తి తన సోషల్ మీడియా అ కౌంట్లో ఉప ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కి సంబంధించి కావడం గమనార్హం. ఈ పోస్టులో సుధా మూర్తి తనకు ఒకసారి అబ్దుల్ కలాం నుంచి ఫోన్ వచ్చిందని తెలియజేశారు. ఆ విషయాన్ని నమ్మలేకపోయిన ఆమె.. రాంగ్ నెంబర్ అని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ఈ పోస్టుతో పాటుగా ఆమె 2006 లో అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్నిcస్వీకరిస్తున్నప్పటి ఫొటోను కూడా షేర్ చేశారు.
అంతేకాదు మాజీ రాష్ట్రపతితో తన సంభాషణకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్లను కూడా ఆమె షేర్ చేశారు. “ ఒకరోజు నాకు అబ్దుల్ కలాం మీతో మాట్లాడాలనుకుంటున్నారు అంటూ ఒక ఆపరేటర్ కాల్ చేశారు. నేను మొదట ఈ విషయాన్ని నమ్మలేక పోయాను. నాకు అబ్దుల్ కలాంతో ఎలాంటి పరిచయం లేదు కాబట్టి నేను వెంటనే 'రాంగ్ నంబర్’ అని చెప్పేశాను.
నా భర్త నారాయణమూర్తికి కాల్ చేయబోయి పొరబాటున నాకు చేశారేమో చూసుకోండి అని కూడా అన్నాను.” అని సుధా మూర్తి తెలిపారు.
అయితే ఆ ఆపరేటర్ మాత్రం ‘ 'కలాంజీ ప్రత్యేకంగా మీతోనే మాట్లాడాలని చెప్పారు’ అని అన్నారట. ఆపరేటర్ మాటలు విన్న సుధా మూర్తి తెలియని ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అబ్దుల్ కలాం గారు ఆమెతో మాట్లాడుతూ ..ఐటీ డివైడ్ అనే అంశంపై ఆమె రాసిన కాలమ్ చదివానని, బాగుందని చెప్పారట.
రచయిత్రిగా అనేక పుస్తకాలు రాసిన సుధామూర్తికి సాహిత్యంలో మాంచి పట్టు ఉంది. అందుకే ఆమెకు సాహిత్యంలో చేసిన సేవలకు గానూ సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం దక్కింది. అంతేకాదు
2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ తో
కేంద్రం ఆమెను సత్కరించింది. ఈ ఏడాది ఆరంభంలో
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట కూడా చేశారు. నారాయణమూర్తి సతీమణి గా కాకుండా సుధామూర్తి గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె జీవితం ఎందరో మహిళలకు ఆదర్శం.