Begin typing your search above and press return to search.

సుజనాకు పశ్చిమ అంత వీజీ కాదు...!?

సుజనా చూస్తే మాస్ ఏరియాలకు వచ్చి జెండాలు పట్టుకుని పోరాటాలు చేసిన నేపధ్యం ఉన్న నాయకుడు కాదు.

By:  Tupaki Desk   |   30 March 2024 3:00 AM GMT
సుజనాకు పశ్చిమ అంత వీజీ కాదు...!?
X

టికెట్ సాధించుకోవడం వేరు. గెలవడం వేరు. తొలి ప్రయత్నంలో ఆయన విజయం సాధించారు. టికెట్ కోసం విజయవాడ పశ్చిన తరఫున ఎందరో ఆశావహులు బరిలో నిలిచినా వారిని దాటుకుని మరీ బిగ్ షాట్ సుజనా చౌదరి టికెట్ సాధించేశారు. అది కూడా సైలెంట్ గా ఆయన వర్క్ చేసుకున్నారు. ఆయనకు టికెట్ దక్కేందుకు రెండు రోజుల ముందు వరకూ ఎక్కడా ఆయన పేరు కూడా ప్రచారంలో లేదు.

అంత నిశ్శబ్దంగా ఆపరేషన్ అయితే జరిగింది. ఇదే సీటు కోసం టీడీపీ నుంచి బుద్ధా వెంకన్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వంటి వారు తీవ్ర ప్రయత్నం చేసి అలసి పోయారు. జనసేనలో ఉన్న పోతిన మహేష్ అనే బీసీ లీడర్ అయితే ఈ రోజు దాకా ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు.

అయినా కూటమి ప్రకటించింది కాబట్టి అంతా సర్దుకుని సుజనా చౌదరి గెలుపు కోసం కృషి చేయాల్సిందే. మరి వారు అంతా అలా చేస్తారా అన్నది వేయి డాలర్ల ప్రశ్న. సరే కూటమి పెద్దలు చెబుతారు కాబట్టి సహకరిస్తామని నోటి మాటగా అంటారు. కానీ అది ఆచరణలో ఎంతవరకూ సాధ్యం అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.

ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూస్తే అది పూర్తిగా మాస్ ఏరియాతో కూడుకున్నది ఒక్క భవానీపురం పరిసర ప్రాంతాలు తప్పించి టోటల్ గా మాస్ అనే అంటారు. అక్కడికి హై ప్రొఫైల్ లీడర్ గా ఉన్న సుజనా చౌదరి ఎంట్రీ ఇస్తున్నారు.

ఆయన ఇప్పటిదాకా ప్రత్యక్ష ఎన్నికల్లో పాలు పంచుకోలేదు. టీడీపీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ రాజ్యసభతోనే సరిపుచ్చుకున్నారు తప్ప బాబుని ఏనాడు అసెంబ్లీ సీటు కోరలేదు. ఆనాడే పోటీ చేసి ఉంటే కొంత ఆయనకు ఎన్నికల వేడి వాడి తెలిసేది.

కానీ ఇపుడు సడెన్ గా ఆయన డైరెక్ట్ ఎలక్షన్స్ కి దిగిపోతున్నారు. అందులోనూ పార్టీ చూస్తే బీజేపీ. ఆ పార్టీకి విశాఖ పశ్చిమలో ఏ మాత్రం బలం లేదు. సుజనా చూస్తే మాస్ ఏరియాలకు వచ్చి జెండాలు పట్టుకుని పోరాటాలు చేసిన నేపధ్యం ఉన్న నాయకుడు కాదు.

ఇక ఇపుడు ఆయనకు ఉన్న ఆధారం ఏంటి అంటే తన నిన్నటి పార్టీ టీడీపీ. అలాగే పొత్తు పార్టీ జనసేన. ఈ రెండింటినీ కో ఆర్డినేట్ చేసుకుంటూ ఆయన రంగంలోకి దిగాలి. ఆయన బిగ్ షాట్ కాబట్టి అర్ధ బలానికి అంగ బలానికి లోటు ఉండకపోవచ్చు. కానీ అవి మాత్రమే గెలుపు రాతను రాయలేవు.

ప్రజలతో మమేకం కావాలి. లోకల్ గా ఉంటారు అందుబాటులో ఉంటారు అన్న నమ్మకం జనాలకు కనిపించాలి. పోనీ ఆయన కాకపోతే ఆయన తరఫున ఫలనా వారు మాకు పరిచయం వారిద్వారా పనులు చేయించుకోవచ్చు అన్న భరోసా అయినా ఉండాలి. చూడబోతే ఏ లింకులూ లేని చోట పారాచూట్ లీడర్ గా సుజనా దిగిపోయారు అని విమర్శలు ఉన్నాయి.

ఇక ఇక్కడ చూస్తే మైనారిటీ ఓటర్లు ఎక్కువ. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సుజనాకు ఆ ఓట్లు రాబట్టుకోవడం కత్తి మీద సాము వంటిది అంటున్నారు. టోటల్ గా అంతా కలసి చెప్పేది ఒకే ఒక్క మాట. సుజనా చౌదరి గెలవాలి అంటే అద్భుతం జరగాలీ అని. మరి రాజకీయ దురంధరుడు చంద్రబాబు అనుంగు అనుచరుడు అయిన సుజనా అలనటి అద్భుతాలు చేయగలుగుతారా లేదా అంటే వెయిట్ అండ్ సీ.