Begin typing your search above and press return to search.

కేటీఆర్ లీగల్ నోటీసులపై సుఖేష్ రియాక్షన్ ఇది!

అవును... తనపై చేసిన ఆరోపణలకు సుఖేష్ చంద్రశేఖర్ కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. అయితే తాజాగా ఈ నోటీసులపై జైల్లో ఉన్న సుఖేష్ స్పందించాడని తెలుస్తుంది

By:  Tupaki Desk   |   20 July 2023 9:51 AM GMT
కేటీఆర్  లీగల్  నోటీసులపై సుఖేష్  రియాక్షన్ ఇది!
X

కొన్ని రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ పై సుఖేష్ చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్‌ కు లేఖ రాశాడు. దీంతో రియాక్టైన కేటీఆర్... లీగల్ నోటీసులు పంపించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సుఖేష్ స్పందించాడని అంటున్నారు.

అవును... తనపై చేసిన ఆరోపణలకు సుఖేష్ చంద్రశేఖర్ కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. అయితే తాజాగా ఈ నోటీసులపై జైల్లో ఉన్న సుఖేష్ స్పందించాడని తెలుస్తుంది. ఇందులో భాగంగా... తాను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో... తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించడంతోపాటు.. తన వద్ద ఆధారాలున్నాయని, దర్యాప్తునకు రెడీ అని చెబుతున్నాడని అంటున్నారు.

అయితే సుఖేష్ ఆరోపణల వార్తలు వెలుగులోకి రాగానే కేటీఆర్ ముందుగా ట్విట్టర్ లో స్పందించారు. "నేరస్తుడు, మోసగాడు సుఖేష్ తనపై చేసిన మతిలేని ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయి. సుఖేష్ అనే వాడి గురించి నేనెప్పుడూ వినలేదు. వాడెవడో కూడా నాకు తెలియదు" అని అన్నారు.

అనంతరం "సుఖేష్ అనే ఒక రోగ్ చేసిన వ్యాఖ్యలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాను. సుఖేష్ లాంటి నేరస్తుడు చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేసే ముందు లేదా ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి" అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ట్విట్టర్ లో చెప్పినట్లుగానే... తనపై వచ్చిన ఆరోపణలపై కేటీఆర్ తన న్యాయవాది ద్వారా సుఖేష్‌ కు లీగల్‌ నోటీసు పంపించారు. తనపై తప్పుడు వివరాలతో గవర్నర్, కేంద్ర హోంమంత్రి, సీబీఐకి లేఖల ద్వారా సుఖేష్ ఫిర్యాదు చేశారని.. వెంటనే తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పి ఫిర్యాదును వెనక్కుతీసుకోవాలని.. అలాకానిపక్షంలో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారని తెలుస్తుంది.

ఇదే సమయంలో... భవిష్యత్తులోనూ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే, అవాస్తవ ఆరోపణలు చేస్తే వాటిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని లీగల్‌ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారని అంటున్నారు.

కాగా... తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందర్ రాజన్‌ కు సుఖేష్ చంద్రశేఖర్‌ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలంటూ కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు తనపై ఒత్తిడి తెస్తున్నారని.. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్‌ మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారని.. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో సుమారు రూ. 200 కోట్ల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. కవితకు తనకూ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉందని.. ఆ ఆధారాలన్నీ ఇప్పటికే ఈడీకి 65 -బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేసినట్లు ఆ లేఖలో చెప్పాడు సుఖేష్. ఈ వ్యాఖ్యలపైనే సీరియస్ అయిన కేటీఆర్... సుఖేష్ కు లీగల్ నోటీసులు పంపించారు!