రుషికొండ ప్యాలెస్ అమ్మితే.. 20% ఎక్కువ ఇచ్చి కొంటా!
ఇందులో భాగంగా మనీలాండరింగ్ కేసుల్లో జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్... రుషికొండ భవనాలను కొనేందుకు ఆసక్తిని చూపించారు. దీనికోసం ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసినట్లు తెలుస్తుంది.
By: Tupaki Desk | 22 Jun 2024 5:30 AM GMTప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రుషికొండ ప్యాలెస్ అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నుంచి విమర్శలు, వైసీపీ నుంచి వివరణలు కామన్ గా మారిపోయాయి. మరోపక్క ఈ ప్యాలెస్ ను ఫైవ్ స్టార్ హోటల్స్ యాజమాన్యాలకు అమ్ముతారనే గాసిప్సూ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి సుకేష్ చంద్రశేఖర్ భారీ ఆఫర్ ప్రకటించాడు.
అవును... ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన రుషికొండ భీమిలీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మీడియాను వెంటపెట్టుకుని ఈ ప్యాలెస్ ను సందర్శించారు. దీంతో... ఈ ప్యాలెస్ లోపల ఎలా ఉందనే విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి వైరల్ గా మారింది.
దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ విషయంపై జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగింది. ఈ సమయంలో ఆ రుషికొండ భవనాలను కొనేందుకు ఓ కీలకమైన వ్యక్తి ముందుకొచ్చారు. ఇందులో భాగంగా మనీలాండరింగ్ కేసుల్లో జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్... రుషికొండ భవనాలను కొనేందుకు ఆసక్తిని చూపించారు. దీనికోసం ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసినట్లు తెలుస్తుంది.
వాస్తవానికి రుషికొండ భవనాల నిర్మాణానికి సుమారు రూ.500 కోట్లు ఖర్చైనట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యల్మో మార్కెట్ విలువ కంటే 20శాతం ఎక్కువ చెల్లిస్తానంటూ సుకేష్ చంద్రశేఖర్ ఆఫర్ ప్రకటించినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మెరకు రుషికొండ భవనాలను కొనేందుకు లేదా లీజుకు తీసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తూ చంద్రబాబుకు లేఖ రాసినట్లు కథనాలొస్తున్నాయి.
ఇదే సమయంలో... తాను రాసిన లేఖను లెటర్ ఆఫ్ ఇంటెంట్ గా పరిగణించాలని చంద్రబాబుకు సుకేష్ విజ్ఞప్తి చేశారని తెలుస్తుంది. ఇదే క్రమంలో.. తనకు విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉందని.. తన గ్రాండ్ మదర్ విశాఖకు చెందిన వారనీ.. అందువల్ల చిన్నతనంలో తాను చాలా సార్లు విశాఖకు వెళ్లాలని.. ఆ బీచ్ లో ఆడుకున్నానని.. రుషికొండ పచ్చదనంతో ప్రకృతి అందాలతో అద్భుతంగా ఉండేదని గుర్తుచేసుకున్నారని అంటున్నారు.
ఇక ఫైనల్ గా... తాను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కారణంగా తనకు పరిమితులు ఉన్నాయని.. అయితే తన టీం పూర్తిస్థాయి వివరాలతో త్వరలో చంద్రబాబుని కలుస్తారని సుకేష్ తన లేఖలో వివరించినట్లు తెలుస్తుంది. దీంతో... ఏపీలో తీవ్ర హాట్ టాపిక్ గా మారిన రుషికొండ భవనాల విషయంలో సుఖేష్ చంద్రశేఖర్.. ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం వైరల్ గా మారింది. దీనిపై ఏపీ సర్కార్ రియాక్షన్ ఏమిటనేది వేచి చూడాలి.
కాగా... మనీలాండరింగ్ తో పటు పలు మోసం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రుషికొండ భవనాలను కొంటానంటూ తన లాయర్ ద్వారా ఓ లేఖను ఏపీ సీఎం చంద్రబాబుకు పంపినట్లు చెబుతున్నారు.