Begin typing your search above and press return to search.

మరో వివాదంలో హిమాచల్‌ప్రదేశ్ సీఎం.. ముఖ్యమంత్రి ఏమన్నారంటే..

హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖిందర్ సింగ్ సుఖు వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారు.

By:  Tupaki Desk   |   14 Dec 2024 4:30 PM GMT
మరో వివాదంలో హిమాచల్‌ప్రదేశ్ సీఎం.. ముఖ్యమంత్రి ఏమన్నారంటే..
X

హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖిందర్ సింగ్ సుఖు వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఇప్పటికే సమోసా అంశంలో ఇరుక్కున్న ముఖ్యమంత్రి.. తాజాగా వైల్డ్ చికెన్ వ్యవహారంలో చిక్కుకున్నారు.

వైల్డ్ చికెన్ వ్యవహారం ఇప్పుడు సుఖిందర్ సింగ్‌ను వెంటాడుతోంది. సీఎం పాల్గొన్న కార్యక్రమంలో చికెన్ వడ్డించిన వీడియో వైరల్ కావడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నారు. శిమ్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన పాల్గొన్నారు. విందు మెనూలో వైల్డ్ చికెన్ వడ్డించారు. సుఖు ఈ వంటకం తిననప్పటికీ ఆరోగ్య శాఖ మంత్రి, ఇతర అతిథులకు ఆయన వడ్డించారు. ఆ చికెన్‌ను మెనూలో చేర్చడాన్ని తప్పుపడుతూ జంతు సంరక్షణ సంస్థ ఓ వీడియోను పోస్టు చేసింది. దాంతో వీడియో వైరల్ అయి అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అటవీ సంరక్షణ చట్టం 1972 ప్రకారం రక్షిత జాతుల జాబితాలో వైల్డ్ చికెన్ కూడా ఉంది. వాటిని వేటాడితే శిక్షార్హులు అవుతారు. అయితే.. రాష్ట్రానికి సీఎం, ఇతర ముఖ్యనేతలు హాజరైన విందులో దానిని ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏకంగా సీఎం వాటిని వడ్డించడం కూడా విమర్శలకు దారితీసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని, బాధ్యతులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.

అయితే.. ఈ వివాదంపై సీఎం సుఖు స్పందించారు. స్థానికులు తనకు ఆ ఆహారాన్ని అందజేశారని, కానీ తాను దానిని తినలేదని పేర్కొన్నారు. కొన్ని మీడియా చానెళ్లు మాత్రం తాను ఆ చికెన్ తిన్నట్లు ప్రసారం చేస్తున్నాయని అన్నారు. పర్వత ప్రాంత ప్రజల జీవనశైలిలో నాన్‌వెజ్ వంటకం ఓ భాగం అని పేర్కొన్నారు. గతంలో అక్టోబర్ 21న ముఖ్యమంత్రి సుఖు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారు. అయితే.. వాటిని సెక్యూరిటీ స్టాఫ్ తిన్నట్లు వార్తలు వెలువడ్డాయి. సీఎం వద్దకు చేర్చాల్సిన సమోసాలు మధ్యలోనే మిస్ కావడంపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ అంశం కూడా ఆ మధ్య వివాదాస్పదం అయింది.