Begin typing your search above and press return to search.

ఆతని దగ్గర 600 రోల్స్ రాయిస్ కార్స్ ఉన్నాయి..

ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై పర్యటన బయలుదేరిన విషయం తెలిసిందే. మోదీ కు స్వాగతం పలకడానికి ఆ దేశ రాజు హసనల్ బోల్కియా విచ్చేయనున్నారు.

By:  Tupaki Desk   |   3 Sep 2024 2:39 PM GMT
ఆతని దగ్గర 600 రోల్స్ రాయిస్ కార్స్ ఉన్నాయి..
X

ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై పర్యటన బయలుదేరిన విషయం తెలిసిందే. మోదీ కు స్వాగతం పలకడానికి ఆ దేశ రాజు హసనల్ బోల్కియా విచ్చేయనున్నారు. హసనల్ బోల్కియాకు ప్రపంచం వ్యాప్తంగా విలాసపురుషుడు అనే పేరు ఉంది. అయన పేరున ఉన్న అరుదైన రికార్డ్స్ ఇందుకు కారణం. అయన ఒక హెయిర్ కట్ కోసం ఖర్చు చేసే మొత్తం దగ్గర నుంచి ఆయన గారెజ్ లో ఉన్న లగ్జరీ కార్ల వరకు అన్ని మన మైండ్ బ్లాక్ చేస్తాయి.

ప్రపంచంలో క్వీన్ ఎలిజిబెత్-2 తర్వాత ఎక్కువ కాలం పదవిలో ఉన్న పాలకుడిగా హసనల్ బోల్కియా పేరిట రికార్డు ఉంది. హసనల్ రాజకుటుంబ సంపద విలువ సుమారు 40 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. వారి ముఖ్య ఆదాయం ఆ దేశం లో లభించే చమురు-గ్యాస్ నుంచి వస్తుంది.1968 లో హసనల్ రాజుగా అధికారం లోకి వచ్చారు.

అతను తన హెయిర్ కట్ కోసం 7000 మైళ్లు దూరం ప్రైవేటు జెట్లో లండన్ లోని ది డోర్చెస్టర్ హోటల్లోని మేఫెయిర్లో ఉన్న బార్బర్ వద్దకు వెళ్తారు. అతని హెయిర్ కట్ కోసం ఖర్చు చేసే మొత్తం సుమారు 20 వేల డాలర్లు అంటే మన కరెన్సీ లో 16.5 లక్షలు ఉంటుంది. అయన భవనంలో 1,700 గదులు,257 బాత్రూమ్లు, ఐదు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయట. 1984 కాలంలో ఈ భవంతి నిర్మాణానికి 1.4 బిలియన్ డాలర్లు ఖర్చుచేశారు.

ఇక ఆయన గ్యారేజ్ చూస్తే మైండ్ బ్లాక్ అవల్సిందే. అయన ప్యాలెస్ లో ఒక గ్యారేజ్ కాదు ఏకంగా 100 గ్యారేజీలు ఉన్నాయి. ఈ గారేజ్ లలో 7,000 లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో 600 రోల్స్ రాయిస్,450 ఫెరారీ, 380 బెంట్లీ కార్లు ఉన్నాయి. వీటిలో జాగ్వార్, పోర్ట్, లంబోర్గిని, బీఎండబ్ల్యూ వంటి వాహనాలున్నాయి. సుల్తాన్ దగ్గర ఉన్న అన్ని కార్స్ లోకి బంగారం పూత పూసిన రోల్స్ రాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.