అపర కుబేరుల జాబితాకు చేరువగా సుందర్ పిచాయ్
గుగూల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా ఉన్న సుందర్ పిచాయ్.. మరో కీలక మైలురాయికి చేరువ కానున్నట్టు 'బ్లూంబర్గ్' నివేదిక స్పష్టం చేసింది.
By: Tupaki Desk | 1 May 2024 7:44 AM GMTప్రపంచ కోటీశ్వరుల జాబితాలో చోటు దక్కించుకోవడం అంటే.. మాటలు కాదు. ఆదాయంతోపాటు.. స్థిరమైన వ్యాపారాలు కూడా.. ఉండాలి. ఈ జాబితాలో ప్రస్తుతం టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఉన్నారు. గత కొన్నాళ్లుగా ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో ముందువరుసలో నిలుస్తున్నారు. ఇక, తర్వాత.. అనేక మంది కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు మరో పేరు ఈ జాబితాలో ఎక్కేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అదే.. సుందర్ పిచాయ్ పేరు.
గుగూల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా ఉన్న సుందర్ పిచాయ్.. మరో కీలక మైలురాయికి చేరువ కానున్నట్టు `బ్లూంబర్గ్` నివేదిక స్పష్టం చేసింది. అదే.. ప్రపంచ కుబేరుల జాబితాలో పిచాయ్ చోటు దక్కించుకోనున్నట్టు తెలిపింది.
ప్రస్తుతం పిచాయ్ ఆస్తులు.. 100 కోట్ల అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 8 లక్షల కోట్ల రూపాయలు) ఇక, ఆయన గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. 2015 నుంచి గూగుల్ స్టాక్ 400 శాతం పుంజుకుంది.
ఇక, సుందర్ పిచాయ్ జీవితాన్ని పరిశీలిస్తే.. ఒక సామాన్య కుటుంబానికి చెందిన తమిళనాడు వ్యక్తి. చెన్నైలో పుట్టి పెరిగారు. కేవలం డబుల్ బెడ్ రూం ఇంట్లో తన సోదరుడితో కలిసి నివసించారు. చిన్న తనంలో ఆయన ఇంట్లో టీవీ కూడా లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక, కారు సంగతి చెప్పనక్కర్లేదు. గతంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలలో తమ ఇంట్లో తాగునీటికి కూడా.. ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చిన్న టెలిఫోన్ ఉండేదని తెలిపారు.
తన తండ్రిబ్రిటీష్ వారి కాలంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. ఇదే ఆయనను టెక్నాలజీ వైపు నడిపించిందని.. పిచాయ్ పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే విద్యపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ చదవిన పిచాయ్.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో స్కాలర్ షిప్పులను సొంతం చేసుకున్నారు. ఈ సమయంలో విదేశాలకు వెళ్లేందుకు.. తన తండ్రి దాచుకున్న సొమ్మును ఖర్చు చేశారని.. ఇది తనకు ఇప్పటికీ గుర్తుందని తెలిపారు. 88 వేల రూపాయలను ఆయన ఖర్చు చేసినట్టు చెప్పారు.
పెనిసిల్వేనియా యూనివర్సిటీలో అడ్వాన్స్‌డ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. మెక్ కిన్‌సే దగ్గర కన్సల్టెంట్‌గా పనిచేశారు. తర్వాత 2004లోగూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేయడం ప్రారంభించారు. తర్వాత.. మేజర్ ప్రాజెక్టులైన గుగుల్ టూల్‌బార్, గూగుల్ క్రోమ్ వంటివాటిని కనిపెట్టారు. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన పిచాయ్.. ప్రపంచ కుబేరుల జాబితాలో చేరడానికి మరో రెండు అడుగుల దూరంలోనే ఉండడం విశేషం.