Begin typing your search above and press return to search.

అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ ఓటు... ఎలా సాధ్యమంటే..?

ఈ సందర్భంగా స్పందించిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయాలి అనుకుంటున్నట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   14 Sep 2024 4:54 AM
అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్  ఓటు... ఎలా సాధ్యమంటే..?
X

బోయింగ్ స్టార్ లైనర్ లోని సాంకేతిక సమస్యల కారణంగా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. 2025 ఫిబ్రవరి వరకూ వీరిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే (ఐ.ఎస్.ఎస్.)లోనే ఉండనున్నారని ఇటీవల నాసా వెళ్లడించింది. మరి ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న యూఎస్ ఎన్నికల్లో వీరు ఓటు పరిస్థితి ఏమిటి?

అవును... తాజాగా ఈ విషయాన్ని వ్యోమగాములు, సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు ప్రస్థావించారు. తాజగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఈ వ్యోమగాములు... అమెరికాలో త్వరలో జరగబోయే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి ప్రస్థావించారు. ఈ ఎన్నికల్లో తాము ఇద్దరం అంతరిక్షం నుంచే తమ ఓటు హక్కుని వినియోగించుకుంటామని తెలిపారు. దీంతో... ఇది ఎలా సాధ్యం అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ సందర్భంగా స్పందించిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయాలి అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు తమ అభ్యర్థనను కిందకు పంపినట్లు వెల్లడించారు. దేశ పౌరులుగా ఓటు హకు వినియోగించుకోవడం తమ కర్తవ్యమని.. ఈ సమయంలో తమ విధిని నెరవేర్చుకునేందుకు నాసా సహకరిస్తుందని వెల్లడించారు.

ఎలా సాధ్యమంటే..?

ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుల్ విచ్ మోర్ లు తమ ఓటు హక్కుని అక్కడ నుంచే వినియోగించుకుంటామని తమ అభ్యర్థనను వెల్లడించడంతో... ఇది ఎలా సాధ్యం అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే... దీనికోసం నాసా.. ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను వినియోగిస్తోంది. ఈ క్లిష్టమైన ప్రక్రియను నాసా కొనసాగిస్తోంది.

దీని ప్రకారం తొలుత ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను నాసా అంతరిక్ష కేంద్రానికి పంపిస్తుంది. ఆ బ్యాలెట్లను రిసీవ్ చేసుకున్న వ్యోమగాములు వాటిలో వివరాలను రాసి తిరిగి భూమి మీదకు పంపిస్తారు. ఈ క్రమంలో ఎన్ క్రిప్షన్ పద్దతిలో బ్యాలెట్లను నాసా మిషన్ కంట్రోల్ సెంటర్ కు పంపిస్తారు. వాటిని అక్కడ నుంచి ఆయా రాష్ట్రాలకు పంపించి ప్రాసెస్ చేయిస్తారు.

కాగా... అంతరిక్షంలో పనిచేసే వ్యోమగాములు తమ ఓటు హక్కును వినియోగించడం ఇదే తొలిసారి కాదు. 1977 నుంచి తమ వ్యోమగాములకు నాసా ఈ అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరగనున్న యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లూ అంతరిక్షం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

అంతరిక్ష కేంద్రంలో న్యూస్ కాన్ఫరెన్స్!:

తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి తమ ఓటు హక్కు వినియోగం గురించి మాట్లాడిన సునీతా విలియమ్స్, బుల్ విచ్ మోర్ లు.. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి గురించి వివరించారు. ఈ సందర్భంగా తొలిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇందులో భాగంగా... అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా బోయింగ్ తమను విడిచివెళ్లడం క్లిష్ట వ్యవహారంగా అనిపిస్తోందని చెప్పిన సునీతా విలియమ్స్... మరికొన్ని నెలల పాటు కక్ష్యలోనే గడపాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇదంతా తమ విధుల్లో భాగమే అని.. ఇది తనకు హ్యాపీ ప్లేస్ అని తెలిపారు. ఇదే సమయంలో... బుచ్ విల్ మోర్ కూడా స్పందించారు.

ఇందులో భాగంగా... ఇక్కడ ఉండటం ఎలాంటి ఇబ్బందీ కలగడం లేదు కానీ... కుటుంబ సభ్యులను మాత్రం మిస్ అవుతున్నట్లు తెలిపారు.