Begin typing your search above and press return to search.

డాక్టర్‌ సునీత నర్రెడ్డికి 'ఐడీఎస్ఎ ఫెలోషిప్‌'

వ్యాధుల రంగంలో డాక్టర్‌ సునీత చేసిన కృషికి గాను ఈ ఫెలోషిప్‌ దక్కిందని తెలిపారు.

By:  Tupaki Desk   |   13 May 2024 12:48 PM GMT
డాక్టర్‌ సునీత నర్రెడ్డికి ఐడీఎస్ఎ ఫెలోషిప్‌
X

అపోలో ఆస్పత్రి డాక్టర్‌ సునీత నర్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికా (ఐడీఎ్‌సఏ) ఫెలోషిప్‌’ లభించింది. డాక్టర్‌ సునీత అంకితభావం, నాయకత్వం, నైపుణ్యం, రోగుల సంరక్షణ ఐడీఎ్‌సఏకు ఎంతగానో దోహదపడతాయని సంస్థ అధ్యక్షుడు స్టీఫెన్‌ కె.స్మిత్‌ అన్నారు.

వ్యాధుల రంగంలో డాక్టర్‌ సునీత చేసిన కృషికి గాను ఈ ఫెలోషిప్‌ దక్కిందని తెలిపారు. ఐడీఎ్‌సఏ ఫెలోషిప్‌ దక్కినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు సునీత చెప్పారు. ఐడీఎ్‌సఏ ఫెలోషిప్‌ పొందినందుకు డాక్టర్‌ సునీతను అభినందిస్తున్నామని అపోలో ఆస్పత్రి జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతారెడ్డి అన్నారు. అంటు వ్యాధుల రంగంలో ఆమె అలుపెరగని కృషి, ఆరోగ్య సంరక్షణలో నిబద్ధత అపోలో అస్పత్రికి గర్వకారణమని ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే ఈ సునీత నర్రెడ్డి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు కావడం విశేషం. వివేకా హత్య కేసులో ఆమె జగన్, అవినాష్ లను తప్పుపడుతూ కోర్టులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఏపీ ఎన్నికలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిలకు మద్దతుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో ఆమె వెంటనే ఉండడం గమనార్హం.