Begin typing your search above and press return to search.

చందమామపై సూర్యోదయం... ల్యాండర్ - రోవర్ పరిస్థితి ఏమిటి?

ఈ సమయంలో మిషన్ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌ లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవంపై వాలిన విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారుతుంది.

By:  Tupaki Desk   |   20 Sep 2023 6:35 AM GMT
చందమామపై సూర్యోదయం... ల్యాండర్ - రోవర్  పరిస్థితి ఏమిటి?
X

చంద్రుడిపై ఇస్రో చేపట్టిన పరిశోధనలు తాత్కాలికంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభమైన తర్వాత విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను నిద్రాణ స్థితిలోకి పంపింది ఇస్రో. దీంతో ల్యాడర్, రోవర్ లు నిద్రలోకి జారుకున్నాయి. ఈ సమయంలో మరో రెండు రోజుల్లో చంద్రుడిపై సూర్యోదయం కాబోతుంది.

అవును... చంద్రుడి దక్షిణ దృవంపై 14 రోజులు పని చేసి అలసిపోయిన విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు ప్రస్తుతం నిద్రలో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రుడిపై ఒక్క రాత్రి గడిచిపోవడం అంటే.. భూమి మీద 14 రాత్రులతో సమానం కాబట్టి... ఈ నెల 22వ తేదీన రాత్రి సమయం ముగుస్తుంది. అనంతరం పగలు ఆరంభం కానుంది.

ఈ సమయంలో మిషన్ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌ లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవంపై వాలిన విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారుతుంది. రాత్రి సమయంలో చంద్రుడిపై మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో ఈ టెంపరేచర్ ను ఎలక్ట్రానిక్‌ పరికరాలు తట్టుకోవడం, అనంతరం రీఛార్జి కావడంపైనే వీటి మెలుకువ ఆధారపడి ఉంది.

ఈ మేరకు భానుడి కిరణాలకు విక్రం ల్యాండర్, రోవర్‌ లో అమర్చిన బ్యాటరీలు రీఛార్జ్ కావాల్సి ఉంటుంది. ఎల్లుండి నుంచి పగటి సమయం మొదలు కాబోతోన్న నేపథ్యంలో... సూర్యుడి వెలుగును గ్రహించడం వల్ల బ్యాటరీలు మళ్లీ రీఛార్జ్ అవుతాయని ఇస్రో ఆశిస్తోంది. అవి రీఛార్జ్ అయితేనే రోవర్ మళ్లీ యాక్టివేట్ కాగలుగుతుంది. అదే జరిగితే... మరో 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగించడానికి వీలు ఉంటుంది.

ఈ సమయంలో స్పందించిన ఇస్రో శాస్త్రవేత్తలు... ల్యాండింగ్‌ ప్రాంతంలో సూర్యోదయం కోసం మరో రెండు రోజులు వేచిచూడాల్సి ఉందని తెలిపింది. ఇదే సమయంలో ఈ నెల 22 తర్వాత రోవర్‌, ల్యాండర్‌ లను మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు.

కాగా... ఆగస్ట్ 23, 2023న చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ ను ల్యాండ్ చేయడం ద్వారా ఇస్రో ఒక చారిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. విక్రం ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగిన తర్వాత, దాని లోపల నుండి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై ప్రయాణించి భూమికి సమాచారాన్ని చేరవేస్తుంది.