Begin typing your search above and press return to search.

ఓ సీఎం అలా ఎలా?... రేవంత్ పై సుప్రీకోర్టు సీరియస్!!

దీంతో... సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది!

By:  Tupaki Desk   |   29 Aug 2024 11:11 AM GMT
ఓ సీఎం అలా ఎలా?... రేవంత్  పై సుప్రీకోర్టు  సీరియస్!!
X

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్స్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవితకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో... ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో... ఈ వ్యాఖ్యలు తాజాగా సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లాయి. దీంతో... సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది!

అవును... కవిత బెయిల్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టింది. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా ఈ అంశం సుప్రీంకోర్టులో ప్రస్థావనకు వచ్చింది. ఇందులో భాగంగా... మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తరుపు న్యాయవాది, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో... సుప్రీంకోర్టు సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.

ఇందులో భాగంగా... బాధ్యత గల స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి.. కోర్టు తీర్పుపై వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో... తాము రాజకీయ పార్టీలను సంప్రదించి ఆర్డర్ ఇవ్వాలా అంటూ ఘాటుగా రియాక్ట్ అయినట్లు సమాచారం! దీంతో... ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కాగా... బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో ఐదు నెలల్లోనే బెయిల్ రావడంపై చర్చ జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే... కవితకు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టట్లేదు కానీ మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలల సమయం పట్టిందని.. కేజ్రీవాల్ కు ఇప్పటికీ బెయిల్ రాలేదని అన్నారు.

అనంతరం... లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆరెస్స్ పని చేసిందని.. ఎన్నికలకు, కవిత బెయిల్ కు సంబంధం ఉందన్న చర్చ జరుగుతుందని రేవత్ రెడ్డి ఆరోపించారు. తాజాగా ఈ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లడంతో... సర్వోన్నత న్యాయస్థానం సీఎం పై మండిపడిందని అంటున్నారు.