Begin typing your search above and press return to search.

ముస్లింలు ఎక్కువగా ఉంటే పాక్? హైకోర్టు జడ్జిని తలంటిన సుప్రీం!

ఇంతకూ అసలేం జరిగిందంటే.. కర్ణాటక హైకోర్టులో బెంగళూరుకు చెందిన ఒక కేసు హైకోర్టు ఎదుట విచారణకు వచ్చింది.

By:  Tupaki Desk   |   21 Sep 2024 4:39 AM GMT
ముస్లింలు ఎక్కువగా ఉంటే పాక్? హైకోర్టు జడ్జిని తలంటిన సుప్రీం!
X

అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు భావోద్వేగాల్ని నియంత్రించుకోవాలి. తొందరపాటు పనికి రాదు. వ్యక్తిగత అభిప్రాయాల్ని తాము నిర్వహించే కీలక ఉద్యోగ నిర్వహణను వ్యక్తపర్చకూడదు. ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. వీటిని మరిచిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. అంతేకాదు.. దీనికి సంబంధించిన నివేదికను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇంతకూ అసలేం జరిగిందంటే.. కర్ణాటక హైకోర్టులో బెంగళూరుకు చెందిన ఒక కేసు హైకోర్టు ఎదుట విచారణకు వచ్చింది. యజమాని - అద్దెదారు మధ్య తలెత్తిన వివాదంపై విచారణ జరిపే వేళలో బెంగళూరులోని ముస్లిం మెజార్టీ ప్రాంతాన్ని పాకిస్థాన్ గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద వ్యాఖ్యానించటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అంతేకాదు.. మరో సందర్భంలో ఆ కేసును వాదించిన మహిళా న్యాయవాదిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

‘‘ఎదుటి పక్షం గురించి ఆమెకుచాలా తెలిసినట్లుంది. ఎంతగా అంటే..వారి లోదుస్తుల రంగు కూడా చెప్పేటంతగా’’ అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో.. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. దీనిపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోర్టును ఆదేశించారు. అంతేకాదు.. జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం కూడా ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.