Begin typing your search above and press return to search.

ఇలాంటి కేసును మీరెప్పుడు చదివి ఉండరు

ఇప్పుడు చదివే ఉదంతం మిమ్మల్ని కచ్ఛితంగా ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. ఇలా కూడా ఆలోచిస్తారా? అన్న భావన కలుగక మానదు.

By:  Tupaki Desk   |   29 Jan 2025 5:42 AM GMT
ఇలాంటి కేసును మీరెప్పుడు చదివి ఉండరు
X

ఇప్పుడు చదివే ఉదంతం మిమ్మల్ని కచ్ఛితంగా ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. ఇలా కూడా ఆలోచిస్తారా? అన్న భావన కలుగక మానదు. విన్నంతనే ఉలిక్కిపడి.. కాసేపు అదే అంశంపై ఆలోచనలు సాగే డ్రామా ఇప్పుడు చెప్పే ఉదంతానికి ఉందని చెప్పాలి. ఇంతకూ అసలు విషయం ఏమంటే..

తాజాగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. పిటిషన్ దాఖలు చేసుకున్న వ్యక్తి వినతి ఏమంటే.. తాను ఫలానా వ్యక్తికి.. తన తల్లికి పుట్టిన సంతామని తాను నమ్ముతున్నానని.. అతను తన తండ్రో కాదో డీఎన్ ఏ పరీక్ష ద్వారా తేల్చాలని ఒక యువకుడు పిటిషన్ దాఖలు చేశారు. అతడి వినతిని సుప్రీంకోర్టు నో చెప్పింది. ఈ పిటిషన్ మూడో వ్యక్తికి సంబంధించిన ప్రైవసీ వ్యవహారమని.. అతడి అనుమతి లేకుండా డీఎన్ఏ పరీక్ష నిర్వహించటం కుదరదని తేల్చేసింది. ఈ పిటిషన్ ను కేరళకు చెందిన ఒక యువకుడు దాఖలు చేశాడు.

అందులో అతనేం చెప్పాడంటే.. కేరళలోని కోచికి చెందిన ఒక మహిళకు 1989లో పెళ్లైంది. 1991లో ఒక కుమార్తె పుట్టింది. 2001లో ఆమెకు కొడుకు పుట్టాడు. 2003లో ఆమె భర్తతో విడిపోయింది. 2006లో వారికి విడాకులు మంజూరు అయ్యాయిప వెంటనే ఆమె కోచి మున్సిపల్ అధికారుల్ని కలిసి తన కొడుకు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంలో తండ్రి పేరును మార్చాలని కోరింది. భర్తతో కలిసి ఉన్నప్పుడు తాను వివాహేతర సంబంధంలో ఉన్నానని.. ఆ సంబంధం వల్ల పుట్టిన సంతానమే తన కొడుకుగా పేర్కొంది.

2007లో స్థానిక కోర్టుఆ మూడో వ్యక్తికి.. పిల్లాడికి డీఎన్ ఏ పరీక్ష చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఆ మూడో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. పిల్లాడు కడుపులో పడిన సమయంలో భార్యాభర్తలు కలిసి లేరని నిరూపిస్తే మూడో వ్యక్తిని డీఎన్ఏ పరీక్షకు ఆదేశిస్తామని హైకోర్టు పేర్కొంది. భార్యభర్తలు కలిసి ఉంటే విడాకులు తీసుకున్న 280 రోజుల్లోపు పుట్టిన పిల్లాడు కూడా ఆ తండ్రికి సక్రమ సంతానమే అవుతాడని పేర్కొంది. ఇదిలా ఉండగా.. 2015లోఆమె కుమారుడు మూడో వ్యక్తి నుంచి భ్రతి కోరుతూ పిటిషన్ వేశారు.

తనకు అనేక శస్త్ర చికిత్సలు అయ్యాయని.. తన వైద్యం ఖర్చులు తల్లి భరించలేకపోతుందని.. తన వైద్య ఖర్చులకు.. చదువుకు చట్టబద్ధమైన తండ్రి నుంచి కూడా ఎలాంటి సాయం అందటం లేదని పేర్కొన్నాడు. కుటుంబ న్యాయస్థానం కొడుక్కి అనుకూలంగా తీర్పును ఇచ్చింది. భ్రతి ఇవ్వాలని స్పష్టం చేయటంతో మూడో వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిల్లాడు కడుపులో పడిన వేళలో సదరు మహిళతో.. భర్త.. మూడో వ్యక్తి ఇద్దరూ కాంటాక్టులో ఉన్నారి భావించినా.. కొడుకు మాజీ భర్తకు సక్రమ సంతానం అవుతాడనని.. ఈ కారణంగా మూడో వ్యక్తి ఎలాంటి చెల్లింపులు జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీం తాజా తీర్పు పలువురిని ఆకర్షిస్తోంది.