Begin typing your search above and press return to search.

లడ్డూ వ్యవహారంలో స్వతంత్ర సిట్ సభ్యులు.. ఏపీ టీమ్ వీరే!

ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ, అటు జాతీయ స్థాయిలోనూ ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

By:  Tupaki Desk   |   16 Oct 2024 10:21 AM GMT
లడ్డూ వ్యవహారంలో స్వతంత్ర సిట్  సభ్యులు.. ఏపీ టీమ్  వీరే!
X

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ తెరపైకి వచ్చిన ఆరోపణలు దేశంలో ఎంత ప్రకంపనలు రేపాయనే సంగతి తెలిసిందే. ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ, అటు జాతీయ స్థాయిలోనూ ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇదే క్రమంలో... సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని.. స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో.. తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటుపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సిట్ అధికారుల పేర్లు వెల్లడించారు.

అవును... తిరుమల లడ్డూ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు అనుమతించలేదని.. సున్నితమైన ఈ అంశంలో స్వతంత్ర దర్యాప్తు జరగాలనే ఉద్దేశ్యంతోనే సిట్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ స్పెషల్ టీంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సభ్యులును ఫైనల్ చేసినట్లు వెల్లడించారు.

ఇందులో భాగంగా.. స్పెషల్ సిట్ కు రాష్ట్రం నుంచి సర్వశ్రేష్ఠ త్రిపాటీ, గోపీనాథ్ శెట్టి పేర్లను పంపినట్లు ఏపీ డీజీపీ వెల్లడించారు. వీరిలో సర్వశ్రేష్ఠ త్రిపాఠి.. సుప్రీంకోర్టు తీర్పుకు ముందు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు అధిపతిగా నియమితులయ్యారు! మొత్తం 9మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. సుప్రీం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

కాగా... తిరుమల లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో.. పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన సుప్రీం... ఐదుగురు సభ్యులతొ స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.