Begin typing your search above and press return to search.

వేధింపుల కేసు పెట్టిన అమ్మాయితో పెళ్లి.. జైలుశిక్ష రద్దు చేసిన సుప్రీం!

ప్రేమ పేరుతోవేధింపులకు గురి చేసిన ఒక యువకుడి విషయంలో దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది.

By:  Tupaki Desk   |   16 May 2024 7:44 AM GMT
వేధింపుల కేసు పెట్టిన అమ్మాయితో పెళ్లి.. జైలుశిక్ష రద్దు చేసిన సుప్రీం!
X

రీల్ లైఫ్ లో చూసే అంశాలు కొన్ని రియల్ లైఫ్ లో అప్పుడప్పడు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి ఉదంతమిది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. పలు మలుపులు తిరిగిన ఈ ఉదంతం చివరకు సుప్రీంకోర్టు కారణంగా ఏళ్లకు ఏళ్లుగా సా..గుతున్న వివాదానికి పుల్ స్టాప్ పడటమే కాదు.. హ్యాపీ ఎండింగ్ అన్నట్లు శుభం కార్డు వేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

ప్రేమ పేరుతోవేధింపులకు గురి చేసిన ఒక యువకుడి విషయంలో దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. కింది కోర్టులు అతడికి విధించిన జైలుశిక్షను రద్దు చేసింది. అదెలానంటే.. ప్రేమ పేరుతో తనను వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసు కేసు పెట్టిన అమ్మాయి.. తర్వాతి కాలంలో అతడ్ని పెళ్లాడటమే. తాజాగా భార్యభర్తలుగా ఉన్న వారి దాంపత్య జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా సుప్రీం ఆసక్తికర తీర్పును ఇచ్చింది. ఈ సినిమాటిక్ కేసు వివరాల్లోకి వెళితే..

సూర్యాపేటకు చెందిన శ్రీకాంత్ ఒక అమ్మాయి వెంట పడేవారు. తనను ప్రేమించాలంటూ ఆమెను వేధించేవాడు. దీంతో ఆ అమ్మాయి తనను వేధిస్తున్న శ్రీకాంత్ మీద 2017 జులై ఒకటిన కేసు పెట్టింది. దీంతో.. అతడిపై పోలీసులు చర్యలు చేపట్టారు. అతడి కేసు విచారణ సూర్యపేట రెండో అదనపు సెషన్స్ జడ్జి కోర్టు విచారించింది. అతడు చేసిన తప్పులకు శిక్షగా 2021లో రెండేళ్లు జైలు.. రూ.వెయ్యి ఫైన్ తో పాటు మరో సెక్షన్ కింద ఆర్నెల్లు జైలు.. రూ.500 ఫైన్ విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ శ్రీకాంత్ హైకోర్టును ఆశ్రయించారు.

తాను యువకుడినని.. తాను ప్రేమించానే తప్పించి.. బాధితురాలికి ఎక్కడా భౌతికంగా హాని తల పెట్టలేదని.. తన ఫ్యూచర్ ను పరిగణలోకి తీసుకొని శిక్ష తగ్గించాలని కోరారు. అతడి వాదనల్ని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు అతడి శిక్షను మూడు నెలలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పునకు సంత్రప్తి చెందని అతను.. అప్పీలు చేసుకొని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా అతడి వాదనల్ని పరిగణలోకి తీసుకొని కింది కోర్టులు అతడికి విధించిన శిక్షను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం బాధితురాలు అప్పటికే అతడ్ని పెళ్లాడటమే. వీరిద్దరూ 2023 ఆగస్టులో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. కోదాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరి పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. అయితే.. వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించేందుకు 2024 ఏప్రిల్ 16న తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదితో ప్రత్యేకంగా తనిఖీ చేపట్టారు. నిజంగానే నాగరాజు.. గతంలో అతడిపై కేసు పెట్టిన బాధితురాలు ప్రస్తుతం భార్యభర్తలుగా ధ్రువీకరించారు.

నాగరాజుపై బాధితురాలు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ.. తర్వాతి కాలంలో వారిద్దరూ పెళ్లి చేసుకున్న కారణంగా అతడ్ని జైలుకు పంపితే వారి వైవాహిక జీవితం ప్రమాదంలో పడుతుందని అభిప్రాయ పడ్డ సుప్రీంకోర్టు.. కింది కోర్టులు విధించిన శిక్షల్ని రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 అధికరణం ప్రకారం తనకున్న అధికారాల్ని ఉపయోగించింది సుప్రీంకోర్టు. జస్టిస్ బీఆర్ గవాయి.. జస్టిస్ సందీప్ మెహతాలో కూడిన ధర్మాసనం బుధవారం ఈ తీర్పును ఇచ్చింది.