Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ కు వదిన స్పెషల్ గిఫ్ట్ !

ఏకంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై ప్రధాని నరేంద్రమోడీ ఆ వీడియోను చూసినట్లు చెప్పారని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Jun 2024 3:27 PM
పవర్ స్టార్ కు వదిన స్పెషల్ గిఫ్ట్ !
X

మొన్నటిదాకా పవర్ స్టార్, ఇప్పుడు జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్. ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు.

ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఘనవిజయం సాధించిన అనంతరం పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఇంటికి కుటుంబంతో సహా వెళ్లి అన్న, వదిన, అమ్మ అంజనాదేవి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ అలరించింది. ఏకంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై ప్రధాని నరేంద్రమోడీ ఆ వీడియోను చూసినట్లు చెప్పారని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పవన్ కల్యాణ్ కు వదినమ్మ సురేఖ అపురూపమైన కానుక అందించింది. తెలుగు ప్రజల ఆశలు నెరవేర్చాలంటూ పనన్ కు స్పెషల్ గిఫ్ట్ కింద ఓ ఫౌంటెన్ పెన్ ను బహూకరించారు. వదినమ్మ నుంచి అందిన స్పెషల్ గిఫ్ట్ చూసి పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేసి ఆ ఖరీదైన పెన్నును జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా పవన్, అన్నా లెజనోవా, సురేఖ, మెగాస్టార్ చిరంజీవి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.