రాహుల్ గాంధీ పై ఎవరు పోటీ చేస్తున్నారో తెలిస్తే.. బీజేపీని వదిలి పెట్టరు!
బీజేపీ కేరళ పార్టీ అధ్యక్షుడు సురేంద్రన్.. రాహుల్‌పై పోటీ చేస్తున్నారు. బీజేపీ ఏరికోరి మరీ సురేంద్రన్‌ను రాహుల్‌పై వయనాడు నుంచి బరిలోకి దించింది.
By: Tupaki Desk | 30 March 2024 8:48 AM GMTకాంగ్రెస్ పార్టీ అగ్రనేత, సిట్టింగ్ ఎంపీ రాహుల్‌గాంధీ.. మరోసారి కేరళలోని పర్యాటక ప్రాంతం వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడ నుంచి పోటీ చేశారు. ఇక్కడ నుంచి గెలిచారు కూడా. అయితే.. ఈ దఫా రాహుల్‌ను ఎట్టిపరిస్థితిలోనూ ఓడించాలని భావిస్తున్న బీజేపీ.. ఆయనకు ఓ బలమైన నాయకుడిని రంగంలోకి దిగింది. అయితే.. ఆయన బలం ఆర్థికంగానో.. సామాజి కంగానో.. లేక పార్టీ పరంగానో అనుకుంటున్నారా? కానేకాదు. నేరాల పరంగా.. ఈ నాయకుడు దిట్ట.
బీజేపీ కేరళ పార్టీ అధ్యక్షుడు సురేంద్రన్.. రాహుల్‌పై పోటీ చేస్తున్నారు. బీజేపీ ఏరికోరి మరీ సురేంద్రన్‌ను రాహుల్‌పై వయనాడు నుంచి బరిలోకి దించింది. అయితే.. సురేంద్రనేమీ తక్కువవాడు కాదు. ఆయన క్రిమినల్స్‌కే క్రిమినల్ అని లోకల్ టాక్. ఏకంగా 242 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో హత్యలు, హత్యాప్రయత్నాలు 70 వరకు ఉన్నాయి. మతకల్లోలాలు రెచ్చగొట్టిన కేసులు 120 వరకు ఉన్నాయి. అత్యాచారాలు, మహిళలపై దాడుల కేసులు 50 వరకు ఉన్నాయి. ఇంత ఘన చరిత్ర ఉన్న సురేంద్రన్.. ఇప్పుడు రాహుల్‌పై పోటీకి దిగారు.
అయితే.. సురేంద్రన్ కేసుల చిట్టాను ఎవరో ఉద్దేశ పూర్వకంగానో.. కాంగ్రెస్ పార్టీ నేతలు.. తమ ప్రత్యర్థి కాబట్టి తప్పుడు ప్రచారం చేయడమో చేయడం లేదు. ఆయా కేసుల వివరాలను సురేంద్రనే నేరుగా తన అఫిడవిట్లలో స్టాంపు పేపర్లపై మరీ వివరించారు. దీంతో ఈ కేసులు వెలుగు చూశాయి. దీనిపై సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నాయి. పోయి పోయి. కరడు గట్టిన నేరస్తుడికా.. రాహుల్‌పై పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది? ఇదేం బీజేపీ ఇక, అభ్యర్థులే లేరా? అంటూ.. ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇది జాతీయ వాదం!
సురేంద్రన్‌పై 241 క్రిమినల్ కేసును బీజేపీ సమర్థించుకుంది. జాతి కోసం ఆయన ఈ కేసులు పెట్టించుకున్నారని తెలిపింది. ఈ కేసులపై బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ స్పందిస్తూ... మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జాతీయవాదిగా ఉండటం చాలా కష్టమని అన్నారు. ఆ ప్రాంతాల్లో జాతీయవాదులు అతి కష్టం మీద జీవితం గడుపుతుంటారని చెప్పారు. అయితే, వారు చేస్తున్న పోరాటం చాలా గొప్పదని కితాబిచ్చారు.