Begin typing your search above and press return to search.

కులాల కుంప‌టి: ఢిల్లీ ఎన్నిక‌ల వేళ‌.. బీజేపీకి 'గోపీ' చిచ్చు

ఢిల్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కోసం వ‌చ్చిన సురేష్ గోపి.. గిరిజ‌న మంత్రి త్వ శాఖ‌ను కేవ‌లం గిరిజ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ఎంపీల‌కే కేటాయిస్తుండ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు.

By:  Tupaki Desk   |   3 Feb 2025 2:30 PM GMT
కులాల కుంప‌టి: ఢిల్లీ ఎన్నిక‌ల వేళ‌.. బీజేపీకి గోపీ చిచ్చు
X

బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఎన్నిక‌ల‌వి. గెలుపు గుర్రం ఎక్క‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుని క‌మ‌ల నాథు లు చ‌మ‌టోడుస్తున్న ఎన్నిక‌లివి. తాము ఒక‌వైపు ప్ర‌చారం చేస్తూనే.. మ‌రోవైపు ఎన్డీయే కూట‌మి పార్టీల త‌ర‌ఫున ఆయా పార్టీల‌ నేత‌ల‌తోనూ ప్ర‌చారాన్ని దుమ్మురేపుతున్న త‌రుణ‌మిది. మంగ‌ళ‌వారంతో ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా ముగియ‌నుంది. బ‌ల‌మైన ఆమ్ ఆద్మీ పార్టీని మ‌ట్టి క‌రిపించి.. ఎట్టిప‌రిస్థితిలోనూ హ‌స్త‌న‌ను కైవ‌సం చేసుకునేందుకు క‌మ‌ల నాథులు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఇవి.

ఇలాంటి కీల‌క స‌మ‌యంలో బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసిన కేర‌ళ‌కు చెందిన ఏకైక బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కూడా అయిన మ‌ల‌యాళ‌ హీరో సురేష్ గోపి.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో బీజేపీ గ్రాఫ్‌ను మింగేసే ప్ర‌య‌త్నం చేశారు. కేంద్రంలోని గిరిజ‌న మంత్రి త్వ శాఖ విష‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్యలు రాజకీ యంగా బీజేపీకి సెగ పెంచాయి. ప్ర‌తిప‌క్షాల నుంచి భారీ ఎత్తున పార్టీకి, అటు ఎంపీకి కూడా సెగ త‌గులు తోంది. ఆయ‌న‌ను రాజీనామా చేయించాల‌ని కేర‌ళ‌కు చెందిన విప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నాయి.

ఏం జ‌రిగింది?

ఢిల్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కోసం వ‌చ్చిన సురేష్ గోపి.. గిరిజ‌న మంత్రి త్వ శాఖ‌ను కేవ‌లం గిరిజ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ఎంపీల‌కే కేటాయిస్తుండ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిన బ్రాహ్మ‌ణ‌, లేదా నాయుడు సామాజిక వ‌ర్గాల‌కు ఈ శాఖ‌ను కేటాయించి.. మంత్రిని చేయ‌డం ద్వారా.. గిరిజ‌నుల‌కు న్యా యం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు గిరిజ‌నుల‌కు మంత్రులుగా ఉన్న వారు ఏమీ చేయ‌లేద‌ని.. అందుకే గిరిజ‌నులు వెనుక‌బ‌డిపోయార‌న్న అర్థం వ‌చ్చేలా కామెంట్లు చేశారు.

అయితే.. గోపి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్య‌లు చేసినా.. కీల‌క‌మైన ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారిని ఉద్దే శించి ఆయ‌న వ్యాఖ్యానించ‌డంతో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు రాజుకున్నాయి. బీజేపీ మ‌న‌సులో మాట‌నే గోపి చెప్పారంటూ. కాంగ్రెస్ నాయ‌కులు నిప్పులు చెరిగారు. మ‌రోవైపు కేర‌ళ‌కు చెందిన మ‌రికొంద‌రు సీపీఐ, సీపీఎం పార్టీల నాయ‌కులు.. ఇది గిరిజ‌నుల‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని.. ఆయ‌న‌ను త‌క్ష‌ణం ప‌ద‌వి నుంచి దించేయాల‌ని డిమాండ్లు తెర‌మీదికి వ‌చ్చాయి. మ‌రి ఈ వివాదంపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.