Begin typing your search above and press return to search.

రెండు సర్వేలు ఒకేసారి... తెలంగాణాలో అధికారం ఆ పార్టీదే...!

అయితే ఈ రెండు సర్వేలూ ఒకే పార్టీకి పట్టం కట్టాయి. తెలంగాణాలో ఈ నెల 30న జరిగే పోలింగ్ లో ప్రజలు ఏ పార్టీని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఈ సర్వేలు స్పష్టంగా చెప్పేశాయి.

By:  Tupaki Desk   |   4 Nov 2023 5:33 PM GMT
రెండు సర్వేలు ఒకేసారి... తెలంగాణాలో అధికారం ఆ పార్టీదే...!
X

తెలంగాణాలో ఒకేసారి రెండు సర్వేలు వెలువడ్డాయి. ఇది కూడా కొద్ది గంటల తేడాలో. అయితే ఈ రెండు సర్వేలూ ఒకే పార్టీకి పట్టం కట్టాయి. తెలంగాణాలో ఈ నెల 30న జరిగే పోలింగ్ లో ప్రజలు ఏ పార్టీని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఈ సర్వేలు స్పష్టంగా చెప్పేశాయి.

ముందుగా ఏబీసీ సీ ఓటర్ సర్వే గురించి చెప్పుకుంటే ఈ సర్వే బీయారెస్ కే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మొత్తం 119 సీట్లు తెలంగాణాలో ఉంటే ఇందులో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నామ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు రావాలి. ఇక అధికార బీయారెస్ కి 49 నుంచి 61 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అదే విధంగా కాంగ్రెస్ విషయం తీసుకుంటే 43 నుంచి 55 దాకా సీట్లు రావచ్చునని పేర్కొంటున్నారు. బీజేపీకి 5 నుంచి 11 దాకా సీట్లు రావచ్చు అని సర్వే స్పష్టం చేసింది. మజ్లీస్ పార్టీకి ఆరు నుంచి ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం ఉంది అని సర్వే వెల్లడించింది. ఓవరాల్ గా చూస్తే బీయారెస్ అధికారానికి దగ్గరగా ఉందని ఈ సర్వే వెల్లడించింది అనుకోవాలి.

ఇక పొలిటికల్ క్రిటిక్ సంస్థ చేసిన సర్వే తీసుకుంటే బీయారెస్ కి 61 నుంచి 66 దాకా సీట్లు వస్తాయని పేర్కొంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి 46 నుంచి 51 దాకా సీట్లు వస్తాయని తెలిపింది. మజ్లీస్ కి అయిదు నుంచి ఏడు సీట్లు వస్తే బీజేపీకి 2 నుంచి అయిదు సీట్లు వస్తాయని లెక్క కట్టింది.

టోటల్ గా చూస్తే ఈ రెండు సర్వేలూ బీయారెస్ కే అధికారం అని తేల్చేశాయి. ఇక రెండవ ప్లేస్ లో చాలా దగ్గరగా కాంగ్రెస్ ఉన్నట్లుగా కూడా వెల్లడించాయి. ఒక విధంగా చెప్పుకోవాలీ అంటే హోరా హోరీ పోరు ఉంటుందని చెబుతూ బీయారెస్ కి పెద్ద పీట వేస్తూ ఈ సర్వే ఫలితాలు ఇచ్చాయి. మరి దీనిని బట్టి చూస్తే బీయారెస్ తక్కువలో తక్కువ సింపుల్ మెజారిటీ తెచ్చుకుని బయటపడుతుంది అని భావించవచ్చా అంటే చూడాల్సి ఉంది.