Begin typing your search above and press return to search.

వర్మ వర్సెస్ జనసేన...బ్యాంక్ ఎన్నికలు ఇంట్రెస్టింగ్

పిఠాపురంలోని కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ కి ఎన్నికలు ఈ నెల 6న జరగనున్నాయి.

By:  Tupaki Desk   |   2 Oct 2024 3:43 AM GMT
వర్మ వర్సెస్ జనసేన...బ్యాంక్ ఎన్నికలు ఇంట్రెస్టింగ్
X

పిఠాపురంలోని కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ కి ఎన్నికలు ఈ నెల 6న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది ప్రత్యర్ధులు కాదు, మిత్రులే. టీడీపీ జనసేన మధ్యనే రాజకీయ సమరం సాగనుంది. వైసీపీ అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.

మొత్తం అయిదుగురు డైరెక్టర్ల కోసం ఈ ఎన్నికలు జరుగుతూటే అటు మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత వర్మ తరఫున అనుచరులు అయిదురుగురుని పోటీకి దించారు. అలాగే జనసేన తరఫున కాకినాడ ఎంపీగా ఉన్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అయిదుగురిని ఎంపిక చేసి మరీ నామినేషన్లు వేయించారు

దాంతో ఎవరూ తగ్గకపోవడంతో ఎన్నిక అనివార్యం అయిపోయింది ఇప్పటికే గుర్తులు కూడా కేటాయించారు. దాంతో ఎవరైనా నామినేషన్ల విత్ డ్రా అయితే తప్ప ఎన్నికలు జరగడం ఖాయం. స్థానికంగా ఎంతో కీలకంగా రెండు పార్టీలు కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలను భావిస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో గెలిస్తే తన బలం లోకల్ గా గట్టిగా ఉన్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు అని భావిస్తున్నాయి. దాంతో ప్రెస్టేజ్ తోనే ఈ నామినేషన్లు దాఖలు చేయించారు అని అంటున్నారు. ఇక వర్మ వర్సెస్ జనసేన అన్నది ఈ బ్యాంకు ఎన్నికల రూపంలో మరో మారు రాజకీయ సమరానికి దారి తీసేలా ఉంది అని అంటున్నారు. వర్మకు స్వతహాగా సొంత బలం ఉంది. ఆయన 2014లోనే ఇండిపెండెంట్ గా గెలిచారు. దాంతో పాటుగా ఆయన మనుషులు గతంలో బ్యాంకులో డైరెక్టర్లుగా నెగ్గారు.

దాంతో ఈసారి కూడా తమ వారే ఉండాలని పట్టుదలగా ఉంది. అంతే కాదు పిఠాపురంలో తాను పక్కా లోకల్ అని తన హవా ఎక్కడా తగ్గకూడదని కూడా వర్మ పట్టుదల మీద ఉన్నారు అని అంటున్నారు. ఇక కాకినాడ ఎంపీ జనసేన కీలక నేత ఉదయ్ శ్రీనివాస్ కి కూడా పిఠాపురంలో బలం ఉంది. పైగా జనసేన జెండా ఎగరేసిన సీటు అది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం గా ఉన్నారు.

దాంతో కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో విజయం సాధించడం ద్వారా జనసేన గ్రాస్ రూట్ లెవెల్ లో కూడా గట్టిగా ఉందని చాటి చెప్పాలని చూస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలు చూసుకుంటే కనుక మిత్రుల మధ్యనే చిచ్చు గా ఈ బ్యాంక్ ఎన్నికలు మారాయా అన్న చర్చ నడుస్తోంది. అయితే ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉన్నా కూడా రాజీకి ఇరు పార్టీలు వచ్చి ఉన్న డైరెక్టర్లను పంచుకుంటే ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం అయ్యే చాన్స్ ఉంది అని కూడా అంటున్నారు.

అది కనుక జరగకపోతే పిఠాపురంలో మొదలైన మిత్రుల రాజకీయ సమరం ఎంత దాకా వెళ్తుంది అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు పవన్ ఎంచక్కా కలసి మెలసి ఉంటున్నారు. ఆ సామరస్యం పిఠాపురంలో అయితే కనిపించడం లేదు అని అంటున్నారు.