Begin typing your search above and press return to search.

కోడి పందెం...నీదా నాదా...వర్మకు షాకేనా ?

పిఠాపురంలో ఎదురులేని స్థితిలో ఒకనాడు ఉన్న టీడీపీ నేత ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే ఎస్ వీ ఎస్ ఎన్ వర్మ పరిస్థితి ఇపుడు డోలాయమానంలో పడిందా అన్న చర్చ సాగుతోంది

By:  Tupaki Desk   |   17 Dec 2024 3:52 AM GMT
కోడి పందెం...నీదా నాదా...వర్మకు షాకేనా ?
X

పిఠాపురంలో ఎదురులేని స్థితిలో ఒకనాడు ఉన్న టీడీపీ నేత ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే ఎస్ వీ ఎస్ ఎన్ వర్మ పరిస్థితి ఇపుడు డోలాయమానంలో పడిందా అన్న చర్చ సాగుతోంది. సంక్రాంతికి బరులు గీసి కోడి పందేలు ఆడడం వర్మ అనుచరులకు ఒక సరదా. అది ఏ ప్రభుత్వం అయినా షరా మామూలుగా సాగిపోయేది. ఆఖరుకు వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్ళూ కూడా వర్మ అండ్ కో కత్తికి ఎదురులేకుండా పోయింది. కానీ ఇపుడు మాత్రం సీన్ రివర్స్ అయిందని అంటున్నారు.

సంక్రాంతి పండుగకు బరులు తీసి పందేలతో రెచ్చిపోవాలని చూసిన వర్మ అనుచరులకు పోలీసుల నుంచి షాకింగ్ రెస్పాన్స్ వస్తోందిట. పందేలు కోసం బరులు గీస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు వస్తున్నాయట. ఇది డిప్యూటీ సీఎం నియోజకవర్గమని అందువల్ల కోడిపందేలు లాంటివి వద్దే వద్దు అని పై నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారుట.

ఒక వేళ కాదూ కూడదు అని ఎవరైనా పందేలకు వెళ్ళినా బరులు గీసినా వ్యవహారం సీరియస్సే అని కూడా చెప్పారని టాక్. అరెస్టుల దాకా వ్యవహారం వెళ్తుందని కూడా పోలేసులు వార్నింగులు ఇచ్చారని టాక్ నడుస్తోంది.

దీంతో ఏమిటి ఇలా అయింది అని వర్మ అనుచరులు అంతా బిత్తరపోతున్నారు. ఆదుకోవాల్సింది తమ నాయకుడు వర్మే అని వారు భావిస్తూ ఆయన ఇంటికి వెళ్తున్నారుట. పిఠాపురంలో తమదే పై చేయి అనుకుంటే ఇలా అయిందేంటి అని కూడా కలవరపడుతున్నారుట.

మరో వైపు చూస్తే సంక్రాంతి పందేలు ఎవరు కట్టినా కూడా చర్యలు తీసుకోవాలని నియోజకవర్గం జనసేన నేతలు పోలీసులకు వినతి పత్రాలు ఇవ్వడంతో రాజకీయ కాక రేపుతోంది. ఈ మొత్తం పరిణామాలు అన్నీ చూసిన వర్మ వర్గానికి ఏమీ పాలు పోవడంలేదు అని అంటున్నారు. అయితే దీని మీద వర్మ మాత్రం మౌనమే నా భాష అంటున్నారుట.

అనుచరుల కోసమని వారి సరదా అని బయటకు గట్టిగా మాట్లాడలేని స్థితి. అందుకే వర్మ సైలెంట్ అయ్యారట. కానీ అనుచరులు మాత్రం ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. ప్రతిష్టకు ఇది సవాలని వారు భావిస్తున్నారు. దాంతో కనీసం రెండు బరులు అయినా వేసుకునేందుకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారుట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.