Begin typing your search above and press return to search.

పిఠాపురంలో వర్మ జోరు...పవన్ ని దాటి మరీ ?

ఈ నేపధ్యంలో పిఠాపురంలో తన పట్టు పోగొట్టుకోకుండా ఉండేందుకు వర్మ ఏకంగా అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు.

By:  Tupaki Desk   |   19 July 2024 1:18 PM GMT
పిఠాపురంలో వర్మ జోరు...పవన్ ని దాటి మరీ ?
X

పిఠాపురం నుంచి ఏపీలో ఎన్నికల వేళ ఎస్వీఎస్ఎన్ వర్మ పేరు మారుమోగిన సంగతి తెలిసిందే. ఆయన టీడీపీ నుంచి టికెట్ ని ఆశించారు. అయితే అనూహ్యంగా అది పవన్ కి పొత్తులో వెళ్లిపోయింది ఆనాడు వర్మ అనుచరులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు, నిరసనలతో మరోసారి ఏపీని ఆకట్టుకున్నారు. మొత్తానికి చంద్రబాబు సర్దిచెప్పడంతో వర్మ జనసేన గెలుపునకు పూర్తిగా సహకారం అందించారు.

ఇక ఎన్నికలు ముగిసాయి. జనసేన భారీ మెజారిటీతో గెలిచింది. అయిఎత వర్మకు ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదు అని అంటున్నారు. ఎమ్మెల్సీగా వర్మకు తొలి విడతలోనే చాన్స్ ఇస్తారని అనుకుంటే అది కాస్తా కడప జిల్లాకు చెందిన సి రామచంద్రయ్యకు వెళ్ళిపోయింది.

దాంతో వర్మ వర్గీయులలో నిరాశ మొదలైంది. మరో వైపు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన ఆధిపత్యం ఎక్కువైంది. ఇలాంటి ఉక్కబోతల నడుమ వర్మ తమ రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. పవన్ కంటే ముందు భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలిచిన వారు వర్మ. అది కూడా ఇండిపెండెంట్ గా. దాంతో వర్మకు మంచి ఫాలోయింగ్ ఉంది.

ఈ నేపధ్యంలో పిఠాపురంలో తన పట్టు పోగొట్టుకోకుండా ఉండేందుకు వర్మ ఏకంగా అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు. నిజానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ని ఆగస్టు 15న ఏపీ అంతటా ప్రారంభిస్తుందని ప్రకటించారు. అపుడే పిఠాపురంలో సైతం డొక్కా సీతమ్మ పేరుతో కొన్ని క్యాంటీన్లను ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే హోదాలో పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు అని ప్రచారం సాగింది.

అయితే పిఠాపురంలో తొలి అన్నా క్యాంటీని ని ప్రారంభించడం ద్వారా వర్మ తనదైన పొలిటికల్ స్టెప్ తీసుకున్నారా అన్న చర్చ సాగుతోంది. ఈ విధంగా ఆయన జనసేనకు ఝలక్ ఇచ్చారా అన్న డిస్కషన్ కూడా సాగుతోంది. పిఠాపురంలో వర్మాస్ కాఫ్యా ఫౌండేషన్ ద్వారా ఈ అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు అని అంటున్నారు.

ఇది ఆయన సొంత ఖర్చుతో ప్రారంభించారు. దానిని ఎవరూ తప్పు పట్టేందుకు లేదు కానీ టైం టైమింగ్ తో వర్మ ఇలా చేయడం పట్లనే హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది అని అంటున్నారు. ఒక విధంగా వర్మ పవన్ కి షాక్ ఇచ్చారా అన్న చర్చ కూడా సాగుతోంది.

అయితే అలాంటిది ఏమీ లేదని పేదలకు సాయం చేయడం కోసమే వర్మ ఇలా చేశారని ఆయన అనుచరులు అంటున్నారు. ఏది ఏమైనా పేదలకు అన్నం మెతుకులు అందించడం మంచి విధానమే కాబట్టి ఇందులో రాజకీయాలు చూడకూడదు అని కూడా అంటున్నారు. అయితే వర్మ వ్యూహం కనుక వేరేగా ఉంటే మాత్రం రానున్న రోజులలో పిఠాపురంలో హాట్ పాలిటిక్స్ నే చూడవచ్చు అని కూడా అంటున్నారు.