Begin typing your search above and press return to search.

రాజగురువుకు కూటమి సర్కార్ భారీ షాక్ ?

ఆయన పీఠాధిపతి. కానీ రాజగురువుగా గత అయిదేళ్ల వైసీపీ జమానాలో చలామణీ అయ్యారు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 3:48 AM GMT
రాజగురువుకు కూటమి సర్కార్ భారీ షాక్ ?
X

ఆయన పీఠాధిపతి. కానీ రాజగురువుగా గత అయిదేళ్ల వైసీపీ జమానాలో చలామణీ అయ్యారు. ఆయనే విశాఖకు చెందిన శ్రీ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర మహా స్వామి అని అంతా చెప్పుకుంటారు. ఆయన జగన్ ని సీఎం చేయడంతో తన పాత్ర కూడా ఉందని భావించే వారు అని చెప్పుకున్నారు. ఆయన చేసిన రాజశ్యామల యాగం ఫలితమే జగన్ కి దక్కిన సీఎం సీటు అని కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే 2019 నాటికి ప్రజలలో టీడీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత జగన్ అధికారంలోకి వస్తే తమకు మేలు చేస్తారని ఆశతో ఒక్కసారి చాన్స్ అంటే ఇచ్చారు.

ఇక మిగిలినవి అన్నీ కూడా ఎవరికి వారు చెప్పుకున్నవే తప్ప వైసీపీ గెలుపునకు అవి ఎంత మేరకు పనిచేసాయన్నది ఆలోచించాల్సిందే. ఇక జగన్ ని స్వామీజీ తమ పీఠానికి పలు మార్లు పిలిపించుకుని ఆశ్వీర్వాదాలు అందించారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ వెళ్లారు. ఒక విధంగా స్వామీజీ రాజ గురువుగా వైసీపీ ప్రభుత్వాన్ని శాసించారు అని చెప్పుకునేవారు ఆయన సలహాతోనే విశాఖకు రాజధానిని షీఫ్ట్ చేసే ఆలోచన వైసీపీ పెద్దలకు కలిగింది అని కూడా అనుకున్నారు

ఇక శ్రీ శారదాపీఠానికి భీమిలీ వద్ద అత్యంత ఖరీదు అయిన 15 ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టింది. అది కూడా ఒకే ఒక్క ఆర్డర్ తో. ఎకరం కేవలం ఒక లక్ష వంతున నామమాత్రం ధరతో దానిని ఇచ్చేశారు. వేదిక్ యూనివర్శిటీని భీమిలీ వద్ద పీఠం ఆధ్వర్యంతో నిర్మిస్తామన్న ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకరించింది.

ఆ తరువాత దానిని కమర్షియల్ గా అభివృద్ధి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కూడా మరో ప్రతిపాదన పీఠం తరఫున పంపించారు అని కూడా చెప్పుకున్నారు. ఈ విషయం తేల్చేలోగానే వైసీపీ సర్కార్ గద్దె దిగింది.ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం పీఠానికి ఇచ్చిన 15 ఎకరాల భూమి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం 225 కోట్లుగా ఉంది.

దాంతో ఈ ఇష్యూ మీద టీడీపీ జనసేన రెండూ ఆందోళనలు చేశాయి. పీఠానికి ఇచ్చిన భూమి అక్రమం అని దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కూడా వారు డిమాండ్ చేశాయి. ఇపుడు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది.

పీఠం భూముల విషయంలో ఏమి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆసక్తి అంతటా ఉంది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది అని అంటున్నారు.

అంటే ఇంతటి ఖరీదైన భూమిని ప్రభుత్వం ఇతర ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తుంది అని అంటున్నారు. ఆ దిశగానే ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు అదే జరిగితే మాత్రం పీఠానికీ రాజగురువుకు బిగ్ షాక్ గా మారుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.