Begin typing your search above and press return to search.

ఎంపీ స్వాతిపై దాడి ఘటన... కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో!

అవును... ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందంటూ ఆ పార్టీ ఎంపీ స్వాతీ మాలీవాల్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 May 2024 9:20 AM GMT
ఎంపీ స్వాతిపై దాడి ఘటన... కేజ్రీవాల్  ఇంటి నుంచి వీడియో!
X

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీ మాలీవాల్ పై కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారంటూ ఆమె ఆరోపించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ ఘటనకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వీడియో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి బయటకు వచ్చింది. దీంతో... ఈ వీడియో వైరల్ గా మారింది.

అవును... ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందంటూ ఆ పార్టీ ఎంపీ స్వాతీ మాలీవాల్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనపై భౌతికంగా తీవ్రంగా దాడి చేశారంటూ ఆమె చేసిన ఆరోపణల నేపథ్యంలో.. మరికొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా సీఎం నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఈ సమయంలో బయటకు తీసుకువెళ్తున్న సెక్యూరిటీ సిబ్బందిని ఆమె వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించింది! ఈ సమయంలో... నిజాలు వెలుగులోకి వచ్చాయి అంటూ ఘటన రోజు, ఆమె కోర్టు ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్లిన రోజు దృశ్యాలు ఉన్న వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ షేర్ చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా సీఎం కేజ్రీవాల్‌ ఇంటి నుంచి ఒక క్లిప్‌ బయటకు వచ్చింది.

ఈ వీడియోలో స్వాతీ మాలివాల్... సెక్యూరిటీ సిబ్బందితో వాదించడం కనిపించింది. ఇక ఆ వీడియో వెలుగులోకి రాగానే.. "హిట్‌ మ్యాన్‌" అంటూ స్వాతి ఎక్స్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఇదే క్రమంలో... అసలు విషయం లేకుండా వీడియోలు ప్రచారం చేయడం ద్వారా.. ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారంటూ ఫైరయ్యారు. దీంతో.. ఆమె "హిట్‌ మ్యాన్‌" అని సంభోదించింది ఎవరిని అనేది ఆసక్తిగా మారింది!

కాగా... తనపై సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారంటూ రాజ్యసభ సభ్యురాలు స్వాతి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో భిభవ్ కుమార్ కూడా మాలీవాల్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో... ఆమె ఆరోపణల వెనక బీజేపీ కుట్ర ఉందని విమర్శించారు. ఈ వ్యవహారంలో స్వాతి ఓ పావు మాత్రమేనని తెలిపారు!