Begin typing your search above and press return to search.

స్విమ్మింగ్ ఫూల్ లో ప్రేమజంట రోమాన్స్.. సడెన్ గా భూకంపం.. ఏం జరిగిందంటే? వీడియో

ఇదిలా ఉండగా, థాయ్‌లాండ్‌లోని ఓ స్కైస్క్రాపర్ యొక్క చివరి అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఓ ప్రేమ జంట ఏకాంతంగా గడుపుతుండగా భూకంపం సంభవించింది.

By:  Tupaki Desk   |   29 March 2025 10:53 AM
స్విమ్మింగ్ ఫూల్ లో ప్రేమజంట రోమాన్స్.. సడెన్ గా భూకంపం.. ఏం జరిగిందంటే? వీడియో
X

శుక్రవారం బ్యాంకాక్ , మయన్మార్ ప్రాంతాల్లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రకృతి విలయంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. భూకంపం ధాటికి వంతెనలు కూలిపోయాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి. పురాతన కట్టడాలు నేలమట్టమయ్యాయి. మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో కూడా భూకంపం తీవ్ర ప్రభావం చూపింది.

భూకంప కేంద్రం మయన్మార్‌లోని సగాయింగ్ ఫాల్ట్‌కు సమీపంలో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి యొక్క అంతర్భాగంలోని టెక్టోనిక్ ప్లేట్లు కదలడం వల్ల ఈ భూకంపం సంభవించిందని వారు తెలిపారు. ఈ ప్లేట్లు 11 నుండి 18 మిల్లీమీటర్ల వేగంతో కదలడం వల్ల వాటి అంచులపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి భూకంపాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

పర్యాటక కేంద్రమైన బ్యాంకాక్‌లో భూకంపం కారణంగా అనేక భవనాలు కుప్పకూలాయి. ఆకాశాన్ని తాకే భవనాలు సైతం భూకంపం ధాటికి ఊగిపోయాయి. ఈ భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా, థాయ్‌లాండ్‌లోని ఓ స్కైస్క్రాపర్ యొక్క చివరి అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఓ ప్రేమ జంట ఏకాంతంగా గడుపుతుండగా భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భవనం ఊగిపోవడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నీటిపై తేలుతూ ప్రేమలో మునిగిపోయిన ఆ జంట, భవనం ఊగడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. స్విమ్మింగ్ పూల్‌లోని నీరు ఒక్కసారిగా పైకి ఎగిసిపడింది, చుట్టూ ఉన్న వస్తువులు కింద పడిపోయాయి.

భయంతో వణికిపోయిన ఆ ప్రేమ జంట వెంటనే స్విమ్మింగ్ పూల్ నుండి బయటికి పరుగులు తీశారు. ఈత దుస్తుల్లోనే తమ గదిలోకి వెళ్లిన అనంతరం లిఫ్ట్ ద్వారా కిందికి చేరుకున్నారు. "బతుకు జీవుడా" అంటూ వారు బయటపడ్డారని బ్యాంకాక్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. స్విమ్మింగ్ పూల్ నుండి ఆ ప్రేమ జంట భయంతో బయటికి వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మయన్మార్ , బ్యాంకాక్‌లో సంభవించిన ఈ భూకంపం తీవ్ర నష్టాన్ని కలిగించింది. ప్రాణనష్టం ఆస్తి నష్టం భారీగా ఉండటంతో ఆ ప్రాంతాలు విషాదంలో మునిగిపోయాయి.