Begin typing your search above and press return to search.

యూఎస్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ని తేల్చేది వీళ్లే... 2020 రిపీట్?

నవంబర్ 5న అమెరికా ఓటర్లు తమ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోనున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Nov 2024 4:16 AM GMT
యూఎస్  నెక్స్ట్  ప్రెసిడెంట్  ని తేల్చేది వీళ్లే...  2020 రిపీట్?
X

నవంబర్ 5న అమెరికా ఓటర్లు తమ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ ల మధ్య ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సమయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం... హారిస్ ను అధిగమించి ట్రంప్ ఆధిక్యంలోకి వచ్చినట్లు చెబుతున్నారు.

అయితే ఇటీవల విడుదలైన మరికొన్ని ట్రెండ్స్ మాత్రం.. స్వింగ్స్ స్టేట్స్ లో డెమోక్రాట్లకే మద్దతు ఉందని అంటున్నారు. ఈ పరిస్థితులో అటు ట్రంప్ కు, ఇటు హారిస్ కు.. ఎవరి బలాబలాలు వారికి ఉన్నాయని.. అవి దాదాపుగా సమానంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో.. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో కీలక పాత్ర న్యూట్రల్ ఓటర్స్ ది అని అంటున్నారు!

అవును... ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, బెట్టింగ్ యాప్ టెండింగ్ లు ఏవి ఏలా చెప్పినా... అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరో తేల్చేది న్యూట్రల్ ఓటర్లేనని తెలుస్తోంది. ప్రధానంగా స్వింగ్ స్టేట్స్ లోని న్యూట్రల్ ఓటర్ల ప్రభావం ఈ ఎన్నికలపై బలంగా ఉందని అంటున్నారు. 2020లో మాదిరిగనే ఈ ఎన్నికలు అదే ఏడు స్వింగ్ రాష్ట్రాలపై ఆధారపడి ఉండనున్నాయని చెబుతున్నారు.

జార్జియా, అరిజోనా, నెవాడా, మిచిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా రాష్ట్రాలు 2020 ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ వైపు మొగ్గు చూపాయి. నార్త్ కరోలినా మాత్రం ట్రంప్ కు జై కొట్టింది. ఈ నేపథ్యంలో ఈ స్వింగ్ రాష్ట్రాల్లోని ఓటర్లే అమెరికా 47వ అధ్యక్షుడు ఎవరు అవుతారో నిర్ణయించే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే 2020లో డెమోక్రాట్లకు మద్దతు పలికిన ఈ స్వింగ్ స్టేట్స్ ఇప్పుడు ట్రంప్ వైపు కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో.. ఈ రాష్ట్రాల్లోని న్యూట్రల్ ఓటర్లపై రెండు పార్టీలూ ప్రధానంగా దృష్టి పెట్టాయి. దీనికి ప్రధాన కారణం... అమెరికాలో న్యూట్రల్ ఓటర్లుగా చెప్పుకునేవారు అతిపెద్ద కూటమిగా ఉన్నారని అంటున్నారు.

గాలప్ పోల్ అంచనాల ప్రకారం... అమెరికాలోని ఓటర్లలో సగటున 43శాతం మంది 2023లో తమను తాము స్వతంత్ర ఓటర్లుగా గుర్తించారని చెబుతున్నారు. ఇదే సమయంలో... ఈ న్యూట్రల్ ఓటర్లతో పాటు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే మరో అంశం పోలింగ్ శాతం అని చెబుతున్నారు.

ప్రధానంగా... కమలా హారిస్ వైపు మహిళలు, మైనారిటీలు మొగ్గు చూపిస్తుండగా.. ట్రంప్ ప్రచారం ఎక్కువగా కన్సర్వేటివ్ అమెరికన్ల కేంద్రంగా కొనసాగుతోంది. దీంతో... పోలింగ్ శాతం కూడా ఈ ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అని అంటున్నారు. కాగా.. అక్టోబర్ 31 నాటికి సుమారు 63 మిలీన్ల అమెరికన్లు ఓటు వేశారు!