Begin typing your search above and press return to search.

సానుభూతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా బాబూ...!

ఇదిలా ఉంటే చంద్రబాబుకు సానుభూతి ఎపుడూ ఆమడదూరంలో ఉంటుంది అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు అన్నది చరిత్ర చెబుతోంది.

By:  Tupaki Desk   |   22 Nov 2023 3:21 AM GMT
సానుభూతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా బాబూ...!
X

కొన్ని సినిమాలు కొంతమంది హీరోలు చేస్తే జనాలు తిప్పికొడతారు. కారణం వారికి ఉన్న ఇమేజ్. వారు హీరోయిజం చూపించాల్సిన చోట అమాయక పాత్రలు వేస్తే అసలు జీర్ణించుకోలేరు. ఇక రాజకీయాల్లో చూస్తే చంద్రబాబు మీద ఒక ముద్ర ఉంది. ఆయన అపర చాణక్యుడు అని.

అంటే తెలివైన నేత అని. ఆయనను ఎవరూ మోసం చేయలేరు. ఆయన ఎప్పటికీ మోసపోరు అని సగటు జనాలు పూర్తిగా నమ్ముతారు. చంద్రబాబు ఏడ్చినా అందుకే నప్పదు అని అంటారు. ఇదిలా ఉంటే చంద్రబాబుకు సానుభూతి ఎపుడూ ఆమడదూరంలో ఉంటుంది అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు అన్నది చరిత్ర చెబుతోంది.

ఆయన మీద మావోయిస్టులు 2003లో అలిపిరి వద్ద బాంబు దాడి చేస్తే నిజంగానే బాబు చావు అంచుల నుంచి బయటపడ్డారు. బాబుని ఆ ఏడుకొండల స్వామి రక్షించారు అని కూడా అంతా అనుకున్నారు. అది అక్టోబర్ లో జరిగితే 2004 మే లో ఎన్నికలను బాబు ముందస్తు మంత్రం అందుకున్నారు

అయితే జరిగిందేంటి అంటే అప్పటికే పాదయాత్ర ఏపీ అంతా చేసి మంచి వేడి మీద ఉన్న వైఎస్సార్ ని జనాలు ఎన్నుకుని సీఎం ని చేశారు. బాబు సానుభూతి కోసం చేతి కట్టుతో కొన్ని నెలలు తిరిగారు. ఆయన ఎన్నికల ప్రచారం పోస్టర్ల మీద కూడా చేతి కట్టుతోనే ఫోటోలు వేశారు. అలాగే బాంబు దాడి దృశ్యాలను కూడా ప్రింట్ చేసి వదిలారు.

కానీ బాబుకు మాత్రం సానుభూతి అసలు ఏ మాత్రం దక్కలేదు. చివరికి తిరుపతిలో కూడా 2004లో కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఇక చంద్రబాబు వన్ ప్లస్ వన్ ఆఫర్ మాదిరిగా అనేక సానుభూతులను వెంట బెట్టుకుని జనంలోకి రాబోతున్నారు. మొదటిది ఏంటి అంటే తన సతీమణిని నిండు అసెంబ్లీలో వైసీపీ నేతలు అవమానించారని.

అదే విధంగా టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని, ఏపీలో టీడీపీని టార్గెట్ చేశారని కూడా మరో సానుభూతి అస్త్రం ఉంది. అనేక మంది టీడీపీ కార్యకర్తలను చంపారని కూడా టీడీపీ సంధిస్తున్న ఇంకో అస్త్రం. వీటి అన్నింటికీ అల్టిమేట్ గా చంద్రబాబు అరెస్ట్, జైలు జీవితం.

రేపటి రోజున బాబు జనాల్లోకి వెళ్ళి తనను అన్యాయంగా అరెస్ట్ చేసి రోజుల తరబడి జైలు గోడల మధ్య ఉంచి భౌతికంగా లేకుండా చేయాలని చూసింది వైసీపీ ప్రభుత్వం అని సెంటిమెంట్ ని పండిస్తారు అని అంటున్నారు. అయితే బాబు అరెస్ట్ నిజం. జైలు జీవితం నిజం. ఆయనను ఈ వయసులో అరెస్ట్ చేయడం కూడా అయ్యో అని అనుకున్న మాటా నిజం.కానీ ఇవన్నీ సానుభూతిగా మారుతాయా అన్నదే ఆలోచించాలి అని అంటున్నారు.

ముందే చెప్పుకున్నట్లుగా బాబుకు సానుభూతి సెంటిమెంట్ వర్కౌట్ అవదని అని అన్న వారే ఎక్కువగా ఉన్నారు. బాబు అంటే వ్యూహాలతో ప్రత్యర్ధులను చిత్తు చేసే చాణక్యుడు. ఆయన ఇమేజ్ అలాగే ఉంది. బాబు నన్ను వేధించారు అని చెప్పుకుంటూ మీటింగులు పెడితే జనాలు కన్నీరు కార్చి ఈవీఎంలలో సైకిల్ గుర్తుకు ఓటేస్తారా అంటే డౌటే అంటున్నారు.

వైసీపీ మీద ప్రజా వ్యతిరేక విధానాల మీద గతంలో మాదిరిగానే టీడీపీ పోరాడితేనే ఫలితం ఉంటుంది అని అంటున్నారు. ప్రజలు అదే కోరుకుంటారు అని అంటున్నారు. వైసీపీకి మేమే ఆల్టర్నేషన్ అని టీడీపీ గట్టిగా చెప్పాలి. వైసీపీ కంటే మేలైన సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యకమాలను అందిస్తామని చెబితే జనాలు టర్న్ అవుతారామే చూడాలని అంటున్నారు.