సింహానికి ఆహారంగా ఖైదీలు.. తలాల్ పోవడంతో హమాలో దీపావళి!
అవును... తనకు ఎదురు తిరిగిన ఖైదీలను తీసుకెళ్లి తన పెంపుడు సింహానికి ఆహారంగా వేసేవాడట తలాల్ దక్కాక్.
By: Tupaki Desk | 15 Dec 2024 12:30 AM GMTఈ ప్రపంచంలో బయటకు కనిపిస్తూ కొంతమంది అధ్యక్షులైన నియంతలు ఉంటే... వారి ప్రయాణం పతనం అంచుకు చేరే వరకూ బయట ప్రపంచానికి కనిపించని రాక్షసులైన పాలకులు మరికొందరు! ఈ సమయంలో ఈ జాబితాలో ప్రధానంగా ఇప్పుడు చర్చకు వచ్చిన పేరు.. దేశం విడిచి పారిపోయిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్!
దేశం విడిచి పారిపోయిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలనలో కొనసాగిన పైశాచిక చర్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో... ప్రభుత్వ వ్యతిరేకులకు ప్రత్యక్ష నరకం చూపిస్తూ.. ఒక్కసారి లోపలికి వెళ్తే ఇక బయటకు వచ్చే అవకాశం లేకుండా చేసే సైద్నాయ మిలటరీ జైలు వ్యవహారం ఇప్పటికే తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇలా అసద్ తన నియంతృత్వ పాలనలో రాక్షసంగా వ్యవహరిస్తుంటే.. తామేమైనా తక్కువ తిన్నామా అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా... అసద్ పాలనలోని అసద్ టైగర్స్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారి తలాక్ దక్కాక్ వికృత ప్రవర్తన ఇప్పుడు తెరపైకి వచ్చింది. అతడు ఖైదీలను సింహానికి ఆహారంగా వేసేవాడట.
అవును... తనకు ఎదురు తిరిగిన ఖైదీలను తీసుకెళ్లి తన పెంపుడు సింహానికి ఆహారంగా వేసేవాడట తలాల్ దక్కాక్. తాజాగా సిరియా తిరుగుబాటు దారుల చేతుల్లోకి వచ్చిన నేపథ్యంలో.. తలాల్ దక్కాక్ ను హమా పట్టణంలో బహిరంగంగా ఉరితీసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది!
కాగా... సుమారు 1500 మంది తలాల్ దక్కాల్ ఆధీనంలో పనిచేసేవారని.. వీరిని అడ్డుపెట్టుకొని ఇతడు కీలకంగా ఎదిగాడని అంటున్నారు. ఈ సమయంలో అసద్ అండదండలు తలాల్ కు పుష్కలంగా ఉండేవని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2005లో జూ నుంచి ఓ సింహాన్ని తీసుకొచ్చి.. తనకు ఎదురు తిరిగినవారిని దానికి ఆహారం వేసేవాడని అంటున్నారు.
అయితే ఇటీవల సిరియా తిరుగుబాటు దారుల చేతుల్లోకి వచ్చిన నేపథ్యంలో.. తలాల్ దక్కాక్ ను హమా పట్టణంలో బహిరంగంగా ఉరితీసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో.. హమా నగరవాసులు దీపావళి తరహాలో సంబరాలు చేసుకుంటున్నారని అంటున్నారు.