Begin typing your search above and press return to search.

తండ్రి ఫించన్ కోసం కూతురి కక్కుర్తి తెలిస్తే నోట మాట రాదంతే

ఇంట్లో ఎవరెవరు ఉంటారని ప్రశ్నించిన పోలీసులు.. ఆమె తండ్రి గురించి ఆరా తీశారు. తన తండ్రి ఆసుపత్రిలో ఉన్నట్లుగా పేర్కొంది.

By:  Tupaki Desk   |   13 May 2024 5:46 AM GMT
తండ్రి ఫించన్ కోసం కూతురి కక్కుర్తి తెలిస్తే నోట మాట రాదంతే
X

ప్రతి నెలా తన తండ్రికి వచ్చే ఫించన్ కోసం ఒక మహిళ దారుణ రీతిలో వ్యవహరించిన తీరు షాక్ కు గురి చేయటం ఖాయం. నెలకు రూ.1.2 లక్షల వరకు వచ్చే ఆదాయాన్ని వదులుకోకూడదన్న ఉద్దేశంతో తన తండ్రి మరణించినప్పటికీ.. ఏళ్లకు ఏళ్లుగా ఆ నిజాన్ని దాచి ఉంచిన ఘోరం తాజాగా తైవాన్ లో వెలుగు చూసింది. ఈ ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు పడేలా చేస్తోంది. ఈ ఉదంతం గురించ తెలిసినవారంతా డబ్బుల కోసం మరీ ఇంత దారుణంగా వ్యవహరించటమా? అంటూ తిట్టిపోస్తున్నారు.

తైవాన్ మీడియా కథనాల ప్రకారం చూస్తే.. ఘోరంగా వ్యవహరించిన మహిళ తండ్రి సైన్యంలో దాదాపు ఇరవై ఏళ్లు పని చేశారు. హోదా.. సర్వీసుకు అనుగుణంగా ఆయనకు నెలకు రూ.1.27 లక్షలకు సమానమైన పెన్షన్ వస్తుంది. కొన్నేళ్లుగా సదరు వ్యక్తి కనిపించట్లేదు కానీ.. అతడి కూతురు ఫించన్ ను తీసుకుంటోంది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీశారు. ఇదే సమయంలో డెంగీ నివారణ చర్యల్లో భాగంగా ఇంటికి వచ్చిన వైద్య సిబ్బందిని సదరు మహిళ అనుమతించలేదు.

దీంతో ఆమెకు రూ.లక్షన్నర ఫైన్ వేశారు. మరో సందర్భంలోనూ ఆమె తన ఇంట్లోకి అధికారుల్ని అనుమతించకపోవటంతో అనుమానాలు పెరిగాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారని ప్రశ్నించిన పోలీసులు.. ఆమె తండ్రి గురించి ఆరా తీశారు. తన తండ్రి ఆసుపత్రిలో ఉన్నట్లుగా పేర్కొంది. మరిన్ని ప్రశ్నలకు ఆమె పొంతన లేని సమాధానాలుచెప్పటంతో అనుమానం మరింత బలపడింది. ఒక దశలో వేరే ఊరిలో ఉన్న తన సోదరుడి దగ్గర ఉన్నట్లుగా పేర్కొంది.

దీంతో.. పోలీసులు ఈ మహిళ మాటల్ని క్రాస్ చెక్ చేయటం షురూ చేశారు. దీంతో.. ఆమె తండ్రిచాలా ఏళ్ల క్రితమే మరణించినట్లుగా గుర్తించారు. దీంతో.. ఇదే విషయాన్ని ఆమెను ప్రశ్నించగా సంబంధం లేని అంశాల్ని ప్రస్తావించటంతో పోలీసులు ఆమె ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఇంట్లో ఒక బ్యాగులో ఎముకల గూడు కనిపించటంతో షాక్ తిన్నారు.

దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టగా.. రెండేళ్ల క్రితమే తన తండ్రి చనిపోయాడని.. ఆయనకు వచ్చే ఫించన్ డబ్బుల్ని మాత్రం క్రమం తప్పకుండా విత్ డ్రా చేస్తున్న విషయాన్ని గుర్తించారు. అయితే.. ఆమె తండ్రి మరణం సహజసిద్ధంగా చోటు చేసుకుందా? ఇంకేమైనా కారణం ఉందా? అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. డబ్బుల కోసం మరీ ఇంత దారుణమా? అంటూ ఈ ఉదంతం గురించి తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు.