Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే టాప్ 2లో తాజ్ హోటల్ బ్రాండ్

అత్యంత నమ్మకమైన కంపెనీగా పేరున్న టాటా గ్రూపులోని ఒక బ్రాండ్ ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ 2 స్థానాన్ని సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   13 Jun 2024 5:30 PM GMT
ప్రపంచంలోనే టాప్ 2లో తాజ్ హోటల్ బ్రాండ్
X

దేశీయ కంపెనీగా సుపరిచితం కావటమే కాదు.. అత్యంత నమ్మకమైన కంపెనీగా పేరున్న టాటా గ్రూపులోని ఒక బ్రాండ్ ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ 2 స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ బ్రాండ్ కు 120 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఇటీవల కాలంలో ఆ బ్రాండ్ తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత బలమైన హోటల్ బ్రాండ్ హోదాను టాటా గ్రూప్ నకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ‘తాజ్’ తిరిగి సొంతం చేసుకుంది.

అంతేకాదు.. ఈ బ్రాండ్ విలువ లెక్క తెలిస్తే ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. తాజ్ బ్రాండ్ తాజా విలువ సుమారు రూ.4500 కోట్లుగా లెక్క కట్టారు. దీని బ్రాండ్ విలువ 45 శాతం పెరిగినట్లుగా తాజా నివేదిక వెల్లడించింది. బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన హోటల్స్ 50 - 2024 రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఏఏఏ ప్లస్ రేటింగ్ తో ప్రపంచంలోనే బలమైన బ్రాండ్ గా తాజ్ నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా డెవలప్ అవుతున్న రెండో బ్రాండ్ గా తాజ్ నిలిచింది. బ్రాండ్ స్ట్రెంత్ సూచీలో 100 పాయింట్లకు తాజ్ సాధించిన స్కోర్ 92.9 పాయింట్లు. ప్రపంచంలో అత్యంత బలమైన రెండో హోటల్ బ్రాండ్ గా నిలిచింది. వందేళ్లకు పైగా సాగుతున్న ఈ బ్రాండ్ ఇప్పటికి తన సత్తా చాటటం.. తన ప్రత్యేకతను తీవ్రమైన పోటీలోనూ నిలుపుకోవటంగమనార్హం.

తమ అతిథులు తాజ్ బ్రాండ్ మీద చూపిన విశ్వాసం.. ప్రేమ.. అప్యాయతలకు నిదర్శనమే ఈ ఘనతకు కారణంగా ఇండియన్ హోటల్స్ కంపెనీ ఎండీ కం సీఈవో పునీత్ చాట్వాల్ వెల్లడించారు. తాము సాధించిన ఈ ఘనతలో తమ ఉద్యోగుల నిబద్ధతను ఆయన ప్రస్తావించారు. తాజ్ ఇప్పుడు 120వ వసంతంలోఅడుగు పెట్టింది. లగ్జరీ హోటల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా తాజ్ నిలిచింది.