Begin typing your search above and press return to search.

గాలికి పోయేది గొడ్డలికి.. పాక్ కు తాలిబన్ కొరివి

గోటికి పోయేదానికి గొడ్డలికి తెచ్చుకోవడం పాత సామెత.. గాలికి పోయేది గొడ్డలి వరకు తెచ్చుకోవడం ప్రస్తుత సామెత.. పాకిస్థాన్ విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది

By:  Tupaki Desk   |   28 Dec 2024 8:30 AM GMT
గాలికి పోయేది గొడ్డలికి.. పాక్ కు తాలిబన్ కొరివి
X

గోటికి పోయేదానికి గొడ్డలికి తెచ్చుకోవడం పాత సామెత.. గాలికి పోయేది గొడ్డలి వరకు తెచ్చుకోవడం ప్రస్తుత సామెత.. పాకిస్థాన్ విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. పొరుగునే ఉంది కదా అని.. తమ భావజాలమే కదా అని.. శత్రువు పైకి ఆయుధంగా వాడొచ్చని తాలిబన్లను పెంచి పోషించింది పాకిస్థాన్. వారే ఇప్పుడు పాముగా మారి పీకకు చుట్టకుంటున్నారు.

ఇంతకూ ఏం జరిగింది..?

పాకిస్థాన్ పొరుగునే ఉన్న అఫ్ఘానిస్థాన్. ప్రస్తుతం అక్కడ తాలిబన్ల పాలన నడుస్తున్న సంగతి తెలిసిందే. 2021లో వీరు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. వాస్తవానికి తాలిబన్లకు మొదటినుంచి అండ పాకిస్థాన్. అప్పటి పరిస్థితుల్లో వారిని బాగా వాడుకుంది కూడా. కానీ, తర్వాత వారి మధ్య స్నేహం పోయి వైరం వచ్చింది. మరీ ముఖ్యంగా తాలిజన్లు అఫ్ఘాన్ పగ్గాలు చేపట్టాక పాకిస్థాన్ తో సంబంధాలు బాగా క్షీణించాయి. మరోవైపు అఫ్ఘాన్ ప్రజలు కూడా పాకిస్థాన్ అంటే ద్వేషిస్తారు. ఇదే సమయంలో భారత్ ను వారు ప్రేమిస్తారు.

పిండికే దిక్కులేదు.. ఎయిర్ స్ట్రైక్స్ అట

పాకిస్థాన్ లో తీవ్ర ద్రవ్యోల్బణం నెలకొంది. ప్రజలు తిండిలేక అల్లాడుతున్న ఫొటోలు.. గోధుమ పిండికీ కొట్లాడుకున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అలాంటి పాకిస్థాన్ తాజాగా ఓ పాడు పని చేసింది. ముందూ వెనుక ఆలోచించకుండా అఫ్ఘాన్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టింది. అసలే.. పగ ప్రతీకారాలు తప్ప ఒక విధానం అంటూ ఉండని తాలిబన్ పాలన. ఇంకేం పాకిస్థాన్ ఎయిర్ స్ట్రైక్స్ వారికి చిర్రెత్తించాయి.

హుటాహుటిన బోర్డర్ లోకి ఫైటర్లు

పాకిస్థాన్ స్ట్రైక్స్ తో తాలిబన్ ఫైటర్లు మండిపడ్డారు. ఏకంగా 15 వేలమంది పాక్ పై దండెత్తారు. వీరికి ముందూ వెనుక విచక్షణ ఉండదు. కిరాతకంగా చంపి అవతల పారేస్తారు. ఇలా 10 మందిని హతమార్చారట. దీంతో పాకిస్థాన్ సైనికుల్లో వణుకు మొదలైంది. వీరితో తలపడేందుకు వారు జంకుతున్నారట. అలాగని నేరుగా యుద్ధం చేసేందుకూ ధైర్యం రావడం లేదు. అడ్డుకోకుంటే ఆక్రమణ తప్పదనే భయం.

భారత్ వైపే చూపు..?

తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించకున్నా గౌరవిస్తోంది. దీంతో భారత్ అంటే వారికి మంచి అభిప్రాయం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాలిబన్లను ఆపగలిగేది భారత్ మాత్రమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ, పాకిస్థాన్ మేలు కోరి భారత్ ఈ పనిచేస్తుందా?