Begin typing your search above and press return to search.
తమిళిసై తలరాత తలకిందులు !
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ లోక్ సభ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయ్యారు
By: Tupaki Desk | 4 Jun 2024 2:11 PM GMTతెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ లోక్ సభ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయ్యారు. ఎన్నికలకు ముందు గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఆమె బీజేపీ తరపున చెన్నై సౌత్ నియోజకవర్గం నుండి పోటీకి దిగింది.
ఇక్కడ పోటీచేసిన డీఎంకే అభ్యర్థి సుమతి తంగపాండియన్ 108163 ఓట్లతో విజయం సాధించింది. డీఎంకేకు 289676 ఓట్లు సాధించగా, తమిళిసై 181513 ఓట్లకు పరిమితం అయింది.
తమిళనాడులో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నియోజకవర్గం కోయంబత్తూరు. ఇక్కడి నుండి పోటీ చేసిన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై 334695 ఓట్లు సాధించాడు. డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్ కుమార్ 418825 ఓట్లు సాధించి 84130 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు.