Begin typing your search above and press return to search.

తమిళ నేలపైనే ప్రారంభమైన ఇనుప యుగం.. 5,300 ఏళ్ల క్రితమే వినియోగం

పురాతన నాగరికతకు నిలమైన భారతదేశంలో ఇనుప యుగం తమిళనాడులోని ప్రారంభమైంది.

By:  Tupaki Desk   |   25 Jan 2025 6:30 PM GMT
తమిళ నేలపైనే ప్రారంభమైన ఇనుప యుగం.. 5,300 ఏళ్ల క్రితమే వినియోగం
X

పురాతన నాగరికతకు నిలమైన భారతదేశంలో ఇనుప యుగం తమిళనాడులోని ప్రారంభమైంది. ఇనుప యుగం ఆరంభమైందని భావిస్తున్న దానికంటే రెండు వేల ఏళ్ళ ముందే ప్రారంభమైందని తెలుస్తోంది. క్రీస్తు పూర్వం 3,345 ఏళ్ల క్రితమే తమిళనాడులో ఇనుప లోహాన్ని వినియోగించినట్లు కాదా అధ్యయనాల్లో వెల్లడయింది.

ప్రపంచంలోనే ఇనుప యుగం తమిళ నేలపైనే ప్రారంభమైందన్న విషయాన్ని ఈ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తమిళనాడు 5,300 సంవత్సరాల క్రితమే ఇనుప యుగం ఆరంభమైనట్లు పురావస్తు శాఖ జరిపిన అధ్యయనంలో తేలింది. తమిళనాడులోని మాంగాడు (సేలం), కీల్నమండి (తిరువన్నామలై), మయిలాండుంపారై (క్రిష్ణగిరి), ఆదిచ్చ నల్లూరు, శివకలై (తూత్తుకుడి) తదితర ప్రాంతాల్లోని స్మశాన వాటికల్లో జరిపిన తవ్వకాల్లో పలు ఇనుప వస్తువులు లభించాయి. వీటిలో శివకలై వద్ద లభించిన ఇనుప ఆయుధం 5,300 సంవత్సరాల నాటిదని, భారత్ తోపాటు అమెరికాలో జరిపిన పరీక్షల్లో నిర్ధారణ అయింది.

ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శివకలై వద్ద సుమారు 2,000 ఎకరాల స్థలంలో ఇనుప వ్యర్ధాలు పరచుకుని ఉండడాన్ని ఆ ప్రాంతానికి చెందిన మాణిక్యం అనే ఉపాధ్యాయుడు గమనించి అక్కడ పురావస్తు తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం 2020లో తవ్వకాలను ప్రారంభించింది. ఆ తవ్వకాల్లో మట్టి కుండలు, ధాన్యపు గింజలు, మనిషి దవడ ఎముకలు, దంతాలు, బూడిద బయటపడ్డాయి. ఆ తరువాత జరిపిన తవ్వకాల్లో ఇనుముతో తయారైన కత్తులు, బానపు కొసలు, ఉంగరాలు, కొడవల్లు సహా 85కుపైగా ఇనుప పనిముట్లు లభించాయి. వీటిని పరీక్షించగా క్రీస్తుపూర్వం 3,345 ఏళ్ల నాటివని స్పష్టమైనది. ఆ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారికంగా తాజాగా ప్రకటించారు.

రాష్ట్ర పురావస్తు పరిశోధనా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఇనుము ప్రాచీనత అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ 5300 ఏళ్ల క్రితమే తమిళనాడులో ఇనుముతో చేసిన వస్తువులను వినియోగించినట్లు శాస్త్రీయంగా నిరూపితమైందని పేర్కొన్నారు. శివ కలయి వద్ద జరిగిన తవ్వకాల్లో తమిళ లిపి అక్షరాలు కలిగిన మట్టికుండ క్రీస్తు పూర్వం 685 ఏళ్ల నాటిదని నిర్ధారణ అయిన విషయాన్ని వెల్లడించారు. అక్కడ లభించిన మూడు ఇనుప పరికరాలు క్రీస్తుపూర్వం 2,953, క్రీస్తు పూర్వం 3,256, క్రీస్తుపూర్వం 3345 ఏళ్ల నాటివని పేర్కొన్నారు.

ఈ ఫలితాల ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా తొలుత తమిళనాడులోని ఇనుప యుగం ప్రారంభమైందని ఎలుగెత్తి చాటుతున్నామని వెల్లడించారు. చారిత్రక ఆధారాల ప్రకారం ప్రపంచంలోనే ఇనుప యోగం క్రీస్తుపూర్వం 1300 సంవత్సరములు మొదలైందని కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతదేశంలో 1500 - 200 మధ్యలో ఇనుపయోగం కొనసాగింది అనేది చరిత్రకారుల వాదన. అయితే ఇప్పుడు తమిళనాడులో బయటపడిన ఇనుప వస్తువులను పరీక్షించగా అవి క్రీస్తు పూర్వం 3345 3259 సంవత్సరాలు నాటివని తేలింది. అంటే ఈ ప్రాంతంలో వాడిన ఇనుప వస్తువులు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవిగా భావించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.