తమ్మినేని ఇంట.. పొలిటికల్ కుంపటి.. హాట్ టాపిక్.. !
కానీ, కుమారుడు, తల్లి కూడా.. జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 27 Dec 2024 6:10 AM GMTవైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంట్లో పొలిటికల్ కుంపటి రాజుకుంది. కుటుంబం అంతా వైసీపీలోనే ఉన్న విషయం తెలిసిందే. సీతారాం సతీమణి నుంచి కుమారుడు చిరంజీవి వరకు.. వైసీపీలోనే ఉన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆముదాల వలస నియోజకవర్గం నుంచి కుమారుడిని రంగంలోకిదింపాలని భావించినా.. జగన్ అవకాశం ఇవ్వలేదు. దీంతో తమ్మినేని నేరుగా రంగంలోకి దిగి ఓడిపోయారు.
దీంతో వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. తాను తప్పుకొని తన కుమారుడికి అవకాశం ఇప్పించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. తాను రిటైర్ అవుతానని కూడా.. తన వర్గానికిచెబుతున్నారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి యూటర్న్ తీసుకుంది. తమ్మినేని చిరంజీవి.. అడుగులు జనసేన వైపు పడుతున్నాయి. తన భవిష్యత్తు జనసేనతోనే ఉంటుందని ఆయన చెబుతున్నారు. అయితే.. దీనిని సీతారాం వ్యతిరేకిస్తు న్నారు. వైసీపీలోనే ఉండాలని చిరంజీవి కి చెబుతున్నారు.
కానీ, కుమారుడు, తల్లి కూడా.. జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వైసీపీ లో ఉంటే భవిష్యత్తు లేదని.. తాను జనసేన వైపు వెళ్తానని కుమారుడు, ఇదే బాటలో సీతారాం సతీమణి కూడా ప్రయాణించేందుకు రెడీ అయ్యి.. సీతారం పై ఒత్తిడి పెంచుతున్నారని.. కుటుంబం మొత్తం జన సేన వైపు వెళ్లాలని పట్టుబడుతున్నారని.. గత వారం రోజులుగా ఈ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్న అనుచరులు చెబుతున్నారు.
కానీ, దీనికి సీతారం ఒప్పుకోవడం లేదని ఓ వర్గం చెబుతున్నా.. ఆయన కూడా అటువైపు మొగ్గు చూపుతు న్నారని.. కానీ, సమయం కోసం వేచి చూస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. దీంతో సీతారాం కుటుంబంలో రాజకీయ చిచ్చు ప్రారంభమైంది. ప్రస్తుతం జనసేన అధినేత ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బలమైన వైసీపీ ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా.. ఇక్కడ పార్టీని బలోపేతం చేయాల న్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి అటువైపు మొగ్గు చూపుతున్నారన్నది చర్చగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.