Begin typing your search above and press return to search.

వైసీపీ కి షాక్ ఇవ్వనున్న మాజీ హోం మంత్రి ?

వైసీపీ అధికారంలోకి వస్తూనే ఒక కొత్త విధానాన్ని అనుసరించింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మహిళలు ఇద్దరిని ఎంచి మరీ హోం మంత్రులను చేసింది.

By:  Tupaki Desk   |   28 Dec 2024 3:42 AM GMT
వైసీపీ కి షాక్ ఇవ్వనున్న మాజీ హోం మంత్రి ?
X

వైసీపీ అధికారంలోకి వస్తూనే ఒక కొత్త విధానాన్ని అనుసరించింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మహిళలు ఇద్దరిని ఎంచి మరీ హోం మంత్రులను చేసింది. తొలి విడతలో గుంటూరు జిల్లాకు చెందిన మేకతోటి సుచరితను హోం మంత్రిగా చేస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు 2004 లో వైఎస్సార్ సబితను హోం మంత్రిగా చేసిన తరువాత ఆయన తనయుడు జగన్ అదే బాటన నడుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంతా అనుకున్నారు.

మూడేళ్ళ పదవీకాలం ముగిసిన తరువాత మంత్రివర్గాన్ని దాదాపుగా మారుస్తూ కొత్త వారికి చోటు కల్పించారు. అలాంటి సందర్భంలో అప్పటికే మహిళా సంక్షేమ శాఖను చూస్తున్న తానేటి వనితను హోం మంత్రిగా చేస్తూ జగన్ మళ్లీ అదే డెసిషన్ ని కంటిన్యూ చేశారు. అలా కోస్తా జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళాలకు హోం మంత్రులుగా జగన్ జమానాలో అవకాశం దక్కింది

అయితే హోం మంత్రిగా తనను తప్పించడంతో మనస్తాపానికి గురి అయిన సుచరిత ఆనాడే పార్టీని వీడాలని అనుకున్నారు అని ప్రచారం సాగింది. అయితే అనేక బుజ్జగింపులు జరిగిన మీదట ఆమె వైసీపీలో కొనసాగారు. ఇక ఆమె సొంత నియోజకవర్గం పత్తిపాడు నుంచి 2024 ఎన్నికల్లో మార్చి జగన్ ఆమెకు తాడికొండ కేటాయించారు. ఇష్టం లేకపోయినా ఆమె అక్కడకి వెళ్ళి పోటీ చేశారు. చివరికి ఓటమి అనుకున్నట్లుగానే వరించింది. ఆ తరువాత ఆమె సైలెంట్ గా ఉన్నారు. ఇటీవల తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా జగన్ ని కలసి స్వయంగా చెప్పారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఆ విధంగా ఆమె వైసీపీకి దూరం అయినట్లే అంటున్నారు.

ఇపుడు మరో న్యూస్ అయితే చక్కర్లు కొడుతోంది. గోదావరి జిల్లాలకు చెందిన మాజీ హోం మంత్రి తానేటి వనిత కూడా వైసీపీకి దూరం అవుతారు అని అంటున్నారు. ఆమె కూడా పార్టీ ఓటమి పాలు అయిన తరువాత సైలెంట్ గా ఉంటున్నారు. ఆమె ఇపుడు కీలక నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.

ఆమె మొదట టీడీపీలోనే ఉండేవారు అని కూడా చెబుతారు. ఆమె తండ్రి జొన్నకుట్టి బాబాజీరావు 1994 నుంచి 1999 దాకా గోపాలపురం ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పనిచేశారు. ఆయన రాజకీయ వారసురాలిగా వచ్చిన తానేటి వనిత 2009లో అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో ఆమె టీడీపీతో విభేదించి వైసీపీలోకి వచ్చారు. 2014, 2019, 2024లలో వైసీపీ ఆమెకు టికెట్ ఇచ్చింది.

వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవిని కూడా ఆమెకు ఇచ్చారు. ఆమెను అయిదేళ్ల మంత్రిగా కొనసాగించారు కూడా. అయినా సరే రాజకీయాల్లో ఇవాళ ఉన్నట్లుగా రేపు ఉండదు. కాబట్టి తన సొంత పార్టీ అయిన టీడీపీ వైపు ఆమె చూస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. తొందరలోనే ఆమె వైసీపీని వీడుతారని ఆ ప్రకటన వస్తుందని అంటున్నారు. అదే జరిగితే వైసీపీ ఎంతో గొప్పగా చెప్పుకునే ఇద్దరు మహిళా హోం మంత్రులను చేశామన్న నినాదం ఒట్టిపోయేలా వైసీపీకి ఇద్దరూ షాకి ఇచ్చినట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.