Begin typing your search above and press return to search.

విధుల్లో 1,500 మంది... టాటా ఫోన్ల తయారీ కేంద్రంలో భారీ పేలుడు!

టాటా ఫోన్ల తయారీ కేంద్రంలో భారీ పేలుడు... ఎలా జరిగింది?

By:  Tupaki Desk   |   28 Sep 2024 10:37 AM GMT
విధుల్లో 1,500 మంది... టాటా ఫోన్ల తయారీ కేంద్రంలో భారీ పేలుడు!
X

టాటా ఫోన్ల తయారీ కేంద్రంలో భారీ పేలుడు... ఎలా జరిగింది?

తమిళనాడులోని హోసూరులోని టాటా ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఫ్యాక్టరీలోని కెమికల్ గోడౌన్ లో పేలుడు సంభవించడంతో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సెల్ ఫోన్ తయారీ విభాగంలో మంటలు చెలరేగడంతో ఉద్యోగులు ప్రాంగణాన్ని ఖాళీ చేయవలసిందిగా ప్రాథమిక నివేదిక సూచించింది.

అవును... తమిళనాడులోని నాగమంగళం సమీపంలోని ఉద్దనపల్లిలో ఉన్న టాటా కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ పెయింటింగ్ యూనిట్ లో తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఆ సమయంలో... దట్టమైన పొగ ఆ ప్రాంతన్ని చుట్టుముట్టడంతో కార్మికులు, స్థానిక నివాసితులలో భయాందోళనలు సృష్టించారు.

ఈ సంఘటన జరిగిన సమయంలో మొదటి షిఫ్ట్ లో సుమారు 1,500 మంది కార్మికులు విధుల్లో ఉన్నారని చెబుతున్నారు. అయితే... ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ సంస్థలో సుమారు 4,500 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు పేర్కొన్నారు.

టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఈపీఎల్) లో గల మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ పెయింట్ యూనిట్ లోని రసాయన గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో... అప్రమత్తమైన సిబ్బంది గోదాములో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని ఏడు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు.

ఫలితంగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే.. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో కొందరు ఉద్యోగులు శ్వాస సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొన్నారని అంటున్నారు. వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇక, ఈ ప్రమాదంలో గణనీయమైన ఆస్తి నష్టం సంభవించినట్లు చెబుతున్నారు.