రాబందులకు ఆహారంగా రతన్ టాటా పార్థివ దేహం.. కానీ, ఏం జరిగిందంటే!
''టాటా''పేరును ప్రపంచ ప్రసిద్ధి చేయడంలో ఆయన తన జీవితాన్ని ధారపోశారు.
By: Tupaki Desk | 11 Oct 2024 3:41 AM GMTభారత దేశం గర్వించదగ్గ పారిశ్రామిక వేత్త రతన్ టాటా. సాధారణంలో రోజూ ఎంతో మంది పుడుతూ ఉం టారు. ఎంతోమంది చనిపోతూ ఉంటారు. కానీ, యావత్ దేశం మొత్తం అతి తక్కువ మంది విషయంలోనే కదిలిపోతుంది. ఆ సేతుహిమాచలం సైతం అతి తక్కువ మంది విషయంలోనే స్పందిస్తుంది. అలాంటి వారి జాబితాలో చేరారు రతన్ టాటా. ''టాటా''పేరును ప్రపంచ ప్రసిద్ధి చేయడంలో ఆయన తన జీవితాన్ని ధారపోశారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం కూడా లేదు.
ఒకవైపు దిగ్గజ కార్పొరేట్ వ్యవస్థకు అధినాయకుడిగా ఉంటూనే.. మరోవైపు.. రతన్ టాటా సామాజిక దృక్ఫ థంతో ముందుకు సాగారు. అనేక ప్రాంతాలను ఆయన దత్తత తీసుకున్నారు. అనేక వేల మందికి చదువు లు చెప్పించారు. అనాథనలను సైకం సొంత బిడ్డల్లా సాకారం. తాను ఒక ఉద్యోగినన్న విషయాన్ని ఆయన ఎప్పుడు చెబుతూ ఉండేవారు. వేల కోట్ల వ్యాపారానికి ఆయన కేంద్ర బిందువు అయినా.. బాధ్యతల విషయంలో సగటు ఉద్యోగికి తనకు తేడా లేదని చెప్పేవారు.
అందుకే ఆయన పేరు శాశ్వతం.. చిరస్థాయిగా నిలిచిపోయింది. బుధవారం రాత్రి పొద్దుపోయాక కన్ను మూశాక.. రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగాయి. అయి తే.. పార్సీ మతాన్ని అనుసరించే టాటాల కుటుంబం సంప్రదాయం ప్రకారం.. పార్థివ దేహాన్ని ఎక్కడా పూడ్చి పెట్టరు. అలాగని అగ్నికి అర్పించి.. చితిలో పడేయరు. పార్సీలకు ప్రత్యేకంగా మరో సంప్రదాయం ఉంది. దానినే `దఖ్మా` అంటారు. దీని అర్థం.. ఇతర జీవులకు ఈ పార్థివ దేహాన్ని ఆహారంగా అందించడం.
అయితే.. ఆ ఇతర జీవుల్లో గరుడ పక్షికి ప్రతిరూపమైన గద్దకు ప్రాధాన్యం ఇస్తారు. చనిపోయిన వ్యక్తుల పార్థివ దేహాలను సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లి.. అక్కడ గద్దలు తినేందుకు వీలుగా పార్థివ దేహాన్ని నగ్నంగా పడుకోబెట్టి వచ్చేస్తారు. దీనినే పార్సీ మతంలో అంత్యక్రియలుగా పేర్కొంటారు. ఈ క్రమంలో టాటా కూడా పార్సీ మతానికి చెందిన వారు కావడంతో తొలుత అలానే అంత్యక్రియలు చేయాలని భావించారు. కానీ, ప్రస్తుతం మారిన వాతావరణ మార్పుల కారణంగా గద్దలు అంతరించిపోతున్నాయి. దీంతో సాధారణ క్రిమేషన్ (విద్యుత్) ద్వారానే ప్రక్రియను పూర్తిచేశారు. కాగా, మహారాష్ట్ర సర్కారు ఈ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో పూర్తి చేసి.. టాటాపట్ల తన గౌరవాన్ని చాటుకుంది.