Begin typing your search above and press return to search.

భారతీయుల కలల్ని నిజం చేస్తున్న రతన్ టాటా

అలా అని సెమీ కండక్టర్ చిప్ తయారీ అంత సులువైనది కాదు. సాదాసీదాగా స్టార్ట్ చేసేందుకు వీల్లేనిది.

By:  Tupaki Desk   |   5 Aug 2024 2:30 PM GMT
భారతీయుల కలల్ని నిజం చేస్తున్న రతన్ టాటా
X

కరోనా తర్వాత అమాంతం మన మొబైల్ ఫోన్లు.. ల్యాప్ టాప్ ధరలు భారీగా పెరిగాయి. అంతేనా.. కార్లు.. మోటార్ బైకుల డెలివరీ బాగా లేట్ అయ్యింది. కొన్ని కంపెనీల్లో కార్లను బుక్ చేస్తే ఆర్నెల్లకు కానీ డెలివరీ ఇవ్వలేమని చెప్పేయటం తెలిసిందే. దీనికి కారణం సెమీ కండక్టర్ చిప్ ల కొరతతో. సౌత్ కొరియా మీదా చైనా మీదా ఆధారపడి.. వారు పంపే సెమీ కండక్టర్ చిప్ ల మీదనే మన మాన్యుఫాక్చరింగ్ ఉండటంతో ఈ సమస్య తలెత్తింది. అలా అని సెమీ కండక్టర్ చిప్ తయారీ అంత సులువైనది కాదు. సాదాసీదాగా స్టార్ట్ చేసేందుకు వీల్లేనిది.

మారిన టెక్నాలజీతో ప్రతి ఎలక్ట్రికల్.. ఎలక్ట్రానిక్ వస్తువులకు ఈ చిప్ ల అవసరం అంతకంతకూ పెరిగే పరిస్థితి. వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా.. స్వదేశంలోనే తయారీ చేసే సత్తా ఉన్న కంపెనీలు చాలా చాలా తక్కువ. ఇంత ఎదిగామని చెప్పుకుంటున్న మనకు సెమీ కండక్టర్ చిప్ తయారు చేసే పరిశ్రమలు లేకపోవటం ఏమిటన్న వెలితి ఈ మధ్యన భారతీయుల్లో ఎక్కువ అవుతోంది. ఇలాంటి వేళ.. అప్పట్లో రతన్ టాటా సెమీ కండక్టర్ చిప్ పరిశ్రమను భారత్ లో నెలకొల్పితే.. మనకు అవసరమైన చిప్ లను మనమే తయారు చేసుకోవటంతో పాటు.. విదేశాల మీదా ముఖ్యంగా చైనా.. సౌత్ కొరియా మీద ఆధారపడటం తగ్గుతుందని భావించారు.

ఈ చిప్ తయారీ కేంద్రానికి తాజాగా రతన్ టాటా శంకుస్థాపన చేశారు. దీనికి అసోం వేదికగా మారింది. అసోంలోని మోరిగావ్ జిల్లాలోని జాగిరోడ్ లో ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేవారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమక్షంలో జరిగింది. ఈ ప్లాంట్ నిర్మాణానికి రూ.27వేల కోట్లు ఖర్చు అవుతుందన్నది అంచనా. ఈ ప్లాంట్ పూర్తి అయ్యాక దాదాపు 27వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనికితోడు వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

ప్రస్తుతం శంకుస్థాపన చేసిన ఈ ప్లాంట్ 2025 నాటికి సిద్ధమవుతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు 2024 ఫిబ్రవరి 29న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఓకే చేశారు. ఐదు నెలలకే ప్లాంట్ నిర్మాణానికి పనులు ప్రారంభం కావటం చూస్తే.. భారతదేశం తన సొంత సెమీ కండక్టర్ చిప్ ను తనకు తానే తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది.రాబోయే రోజుల్లో మనం విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుంది. దేశాన్ని మలుపు తిప్పే ఒక భారీ ప్లాంట్ ను సింఫుల్ గా శంకుస్థాపన చేయటం.. ఎలాంటి ప్రచార అర్భాటాలు లేకపోవటం చూస్తే.. రతన్ టాటాకు భారతీయులు మరింత రుణపడి ఉన్నారని చెప్పక తప్పదు.