టాటా టెక్ ఐపీవో.. లిస్టింగ్ ఎప్పుడు? అలాట్ మెంట్ చెకింగ్ ఎలా?
స్టాక్ మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ ఐపీవో.. అంచనాలకు మించి సబ్ స్క్రిప్షన్ కోసం ఎగబడ్డారు.
By: Tupaki Desk | 30 Nov 2023 4:36 AM GMTఏళ్లకు ఏళ్లుగా ఐపీవోకు దూరంగా ఉన్న టాటా టెక్నాలజీ నుంచి వచ్చిన టాటా టెక్ ఐపీవో ఎంతలా బ్లాక్ బస్టింగ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ ఐపీవో.. అంచనాలకు మించి సబ్ స్క్రిప్షన్ కోసం ఎగబడ్డారు. నవంబరు 22 ను ఐపీవోకు వచ్చిన ఈ షేర్ అలాట్ మెంట్ కోసం అప్లై చేసుకోమని చెబితే.. కేవలం మూడు రోజుల వ్యవధిలో అవసరానికి మించి 69.4 రెట్లు అధికంగా సబ్ స్కైబ్ చేసుకోవటం గమనార్హం.
ఇంతటి డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. అప్లై చేసుకున్న వారిలో ఎవరికి అలాట్ అవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. లక్ ఉంటే మాత్రమే ఈషేర్లు అలాట్ అవుతాయన్న మాట మార్కెట్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒక్కో లాట్ కు రూ.15వేల చొప్పున పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎవరెన్నిలాట్లకు పెట్టుబడి పెట్టినా.. ఒక సిస్టం ప్రకారం అలాట్ మెంట్ ను మెకానికల్ గా చేసేస్తారు. అయితే.. ఈ ఐపీవో సందర్భంగా షేర్లు అలాట్ అయితే మాత్రం పంట పండినట్లే చెప్పాలి. ఎందుకంటే.. దీన్నిమార్కెట్ లోకి ట్రేడింగ్ స్టార్ట్ చేసినంతనే.. దీని ధర అసాధారణంగా పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 16.5 రెట్లు ఎక్కువగా సబ్ స్రైబ్ అయితే.. ఎన్ఐఐ పోర్షన్ 62.1 రెట్లు ఎక్కువగా సబ్ స్క్రైబ్ అయ్యింది. క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ పోర్షన్ సైతం 203.4 రెట్లు ఎక్కువగా బుక్ అయితే.. ఎంప్లాయిస్ పోర్షన్ 3.7 రెట్లు.. షేర్ హోల్డర్స్ పోర్షన్ 29.1 రెట్లు ఎక్కువగా బుకింగ్ అయినట్లుగా చెబుతున్నారు. టాటా టెక్నాలజీస్ మొత్తం 4.5కోట్ల (దగ్గర దగ్గర) షేర్లను ఆఫర్ చేయగా.. ఏకంగా 312.6 కె్ల మేర షేర్లు బిడ్డింగ్ కురావటం గమనార్హం.
ఈ ఏడాది అందరూ అత్యంత ఆసక్తిగా చూసిన ఐపీవోల్లో ఇది ముందు ఉంటుందని చెప్పాలి. ఈ ఐపీవోజారీ చేసిన మొదటి రోజునే అవసరానికి మించి 6.5 రెట్లు అధికంగా సబ్ స్కైబ్ చేసుకోగా.. రెండో రోజు నాటికి 14.8రెట్లు అధికంగా సబ్ స్క్రైబ్ అయ్యిందని చెప్పాలి. ఐపీవో ఆఫర్ ప్రైస్ రూ.500 కాగా చెబుతున్నారు. లిస్టింగ్ ప్రైస్ ఒక్కో షేరు రూ.892గా లిస్టు అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇది ఆఫర్ ధర కంటే రూ.78.4 రెట్లు ఎక్కువగా చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఈ ఐపీవోలో బుక్ చేసుకున్నాం. మరి.. షేర్లు మాకు అలాట్ అయ్యాయా? లేదా? అన్నది చెక్ చేసుకోవాలంటే చాలా సులువు అని చెబుతున్నారు. ఐపీవో అలాట్ మెంట్ ను చెక్ చేసుకోవాలంటే.. https://www.bseindia.com/investors/appli_check.aspx వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. వెబ్ సైట్ లోకి ఎంట్రీ అయ్యాక ఇష్యూ టైప్ లోకి వెళ్లి ఈక్విటీను ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఇష్యూ నేమ్ వద్ద.. "టాటా టెక్నాలజీస్" అని సెలెక్టు చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ నంబరు లేదంటే పాన్ నంబరును నమోదు చేసి సెర్చ్ చేస్తే.. అక్కడ స్టేటస్ కనిపిస్తుందని చెబుతున్నారు. ఒకవేళ.. ఈ ఐపీవోలో మీరు కనుక మదుపు చేసి ఉంటే.. ఒక్కసారి చెక్ చేసుకోగలరు.