Begin typing your search above and press return to search.

''ఎఫ్.ఎం. జీ, ఎం.ఎం. జీ'' ట్యాక్స్ పేయర్ పేరడీ సాంగ్ వైరల్!

ఈ రాజకీయ విమర్శలే కాకుండా ట్యాక్స్ పేయర్స్ నుంచి విమర్శలు వెళ్లువెత్తయని అంటున్నారు!

By:  Tupaki Desk   |   3 Aug 2024 9:28 AM GMT
ఎఫ్.ఎం. జీ, ఎం.ఎం. జీ  ట్యాక్స్  పేయర్  పేరడీ సాంగ్  వైరల్!
X

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ - 2024పై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ ను పూర్తిగా మిత్రపక్షాల మన్నలను పొందడం కోసమే రూపొందించినట్లు ఉందని ఒకరంటే.. 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో కి కాపీ అని మరొకరు కామెంట్ చేశారు.

ఈ రాజకీయ విమర్శలే కాకుండా ట్యాక్స్ పేయర్స్ నుంచి విమర్శలు వెళ్లువెత్తయని అంటున్నారు! ఇక బడ్జెట్ ప్రకటన అనంతరం స్టాక్ మార్కెట్ లో భయాందోళనలు నెలకొన్నాయనే మాటలు వినిపించాయి. ఈ సమయంలో క్యాపిటల్ గెయిన్స్ పై పన్నులు పెంచడం పైనా చర్చ జరుగుతుందని చెబుతున్నారు. ఈ సమయంలో... ప్రముఖ పెట్టుబడిదారుడు ఒకరు పాట అందుకున్నారు.

అవును... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పొందుపరిచిన ట్యాక్స్ లపై భయాందోళనలు నెలకొన్నాయన్నట్లుగా, అసలు ఈ పన్నులన్నీ ఎలా చెల్లించాలంటూ ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా స్వయంగా ఓ పాట పాడి ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పాట నెట్టింట వైరల్ గా మారుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోసం పాట ఎత్తుకున్న విజయ్ కేడియా... "ఎఫ్.ఎం. జీ, ఎం.ఎం. జీ... ఇత్నా ట్యాక్స్ మెయిన్ కైసే భారు" (ఆర్థిక మంత్రి గారూ ఆర్థిక మంత్రి గారూ ఇంత పన్ను మేము ఎలా కట్టగలము?) అంటూ ప్రశ్నించారు!

"బాంబే" సినిమా కోసం ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన "ఊరికే చిలకా వేచి ఉంటాను కడవరకూ" పాటకు ఆయన పేరడి రచించారు. ఇందులో భాగంగా... "ఎఫ్ ఎం జీ, ఎఫ్ ఎం జీ ఇంత పన్ను మేము ఎలా కట్టగలము.. ఎస్.టీ.టీ., ఎస్.టీ.జీ., ఎల్.టీ.సీ.జీ. పెంచేశారు.. డివిడెండ్ పే అని డబుల్ డ్యాక్స్ తీసుకుంటున్నారు.." అంటూ పాట రూపంలో ట్యాక్స్ పేయర్స్ ఆవేదనను తెలియజేసే ప్రయత్నం చేశారు.

ప్రధానంగా క్యాపిటల్ గెయిన్స్ పై పన్నును పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎండగడుతూ ఈ పాట పాడారన్నమాట! ప్రస్తుతం ఇతని పాటను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఈ పోస్ట్ కింద నెటిజన్లు, అందులోనూ ప్రత్యేకంగా ట్యాక్స్ పేయర్లు కామెంట్లతో చెలరేగిపోతూ.. తమ ఆవేదనను జత చేరుస్తున్నారు!