Begin typing your search above and press return to search.

అదిరేలా టీసీఎస్ షేర్ల బైబ్యాక్ ప్రకటన.. ఒక్కో షేరుకు ఎంత ఎక్కువంటే?

వావ్ అనేలాంటి షేర్ల బైబ్యాక్ ప్రకటనను చేసింది టీసీఎస్. టాటా గ్రూప్ నకు చెందిన ఈ ఐటీ దిగ్గజ సంస్థ వెలువరించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:30 AM GMT
అదిరేలా టీసీఎస్ షేర్ల బైబ్యాక్ ప్రకటన.. ఒక్కో షేరుకు ఎంత ఎక్కువంటే?
X

వావ్ అనేలాంటి షేర్ల బైబ్యాక్ ప్రకటనను చేసింది టీసీఎస్. టాటా గ్రూప్ నకు చెందిన ఈ ఐటీ దిగ్గజ సంస్థ వెలువరించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా 17వేల కోట్ల రూపాయిల విలువ కలిగిన షేర్లను బైబ్యాక్ చేసేందుకు ఓకే చేవారు. అంతేకాదు..షేర్ల బైబ్యాక్ కు సంబంధించిన తేదీల్ని ప్రకటించారు.

డిసెంబరు ఒకటిన మొదలయ్యే ఈ బైబ్యాక్ ప్రాసెస్ వారం వ్యవధిలో ముగియనుంది. డిసెంబరు 7ను ఆఖరి తేదీగా డిసైడ్ చేవారు. రూపాయి ముఖ విలువ ఉన్న టీసీఎస్ షేరు ప్రస్తుతంఒక్కొక్కటి రూ.3473.30 వరకు పలుకుతున్నాయి. అలాంటి షేరును ఒక్కొక్కటి రూ.4150 చొప్పున కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. మొత్తం 4.09 కోట్ల ఈక్విటీ షేర్ల బైబ్యాక్ చేయనుంది. పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్లో చూసుకుంటే ఇది 1.12 శాతంగా చెబుతున్నారు.

గడిచిన ఆరేళ్లలో టీసీఎస్ తన షేర్లను బైబ్యాక్ ప్రకటన చేయటం ఇది ఐదోసారి. ప్రస్తుత మార్కెట్ విలువకు దాదాపు 20 శాతం ప్రీమియంకు టీసీఎస్ షేర్లు కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు కంటే దాదాపు రూ.700 ఎక్కువకు బైబ్యాక్ ఆఫర్ ఇవ్వటం చూస్తే.. ఇంత ఎక్కువ ధరకు షేర్లను వెనక్కి తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.12.70 లక్షల కోట్లుగా చెబుతారు. ఈ షేరు గరిష్ఠ విలువ రూ.3679 కాగా.. కనిష్ఠ విలువ రూ.3070.25గా చెబుతారు. అలాంటిది ఇప్పుడు ఒక్కో షేరును రూ.4150కు కొనుగోలు చేయటంచూస్తే.. టాటానా మజాకానా అనిపించక మానదు. తాజా నిర్ణయంతో సదరు షేర్ ధర మార్కెట్ లో ఏం కానుందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.