పెన్ను, పేపర్ లకు రూ.9.8 కోట్లు... జగన్ పై టీడీపీ మరో ఆరోపణ!
జగన్ ప్రభుత్వ హయాంలో పెన్నులు, స్టేషనరీ వస్తువులకు కోట్లు ఖర్చు చేసారనే సంచలన విషయాన్ని తాజాగా టీడీపీ తెరపైకి తెచ్చింది.
By: Tupaki Desk | 9 Nov 2024 6:21 AM GMTప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా పోస్టులు, వాటిలో అసభ్యకరమైన వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హనానికి పాల్పడే కామెంట్లు, తప్పుడు కథనాలు రాస్తున్నవారిపై కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇకపై సోషల్ మీడియా వేదికగా, భావ ప్రకటనా స్వేచ్ఛ మాటున ఎవరైనా తప్పుడు కథనాలు పెడితే పరిస్థితులు వేరేగా ఉంటాయని ఇప్పటికే ప్రభుత్వం నుంచి హెచ్చరికలు వచ్చేశాయి.
అంటే... ప్రతీ విషయంలోనూ కూటమి సర్కార్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోబోతోందన్నమాట. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సోషల్ మీడియా జనాలను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో.. ఇసుక విషయంలోనూ, లిక్కర్ షాపుల విషయంలోనూ ఎవరు జోక్యం చేసుకున్న వదిలేది లేదంటూ చంద్రబాబు.. తన సొంత పార్టీ నేతలకే చెబుతున్నారు.
ఇలా తప్పు ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదని చెబుతున్నారు. ఈ సమయంలో... గత ప్రభుత్వ హయాంలో జగన్ సర్కార్ ఎగ్ పఫ్ లకు, ఇంటికి ఇనుప కంచె వేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ కూటమి సర్కార్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... మరో సంచలన విషయాన్ని తెరపైకి తెచ్చింది.
అవును... జగన్ ప్రభుత్వ హయాంలో పెన్నులు, స్టేషనరీ వస్తువులకు కోట్లు ఖర్చు చేసారనే సంచలన విషయాన్ని తాజాగా టీడీపీ తెరపైకి తెచ్చింది. గతంలో సీఎంవో లో ఎగ్ పఫ్ లకు రూ.3.62 కోట్లు, జగన్ ఇంటి చుట్టూ ఇనుప కంచెకు రూ.12 కోట్లకు పైగా ఖర్చు చేసిందని సంచలన విషయాలు వెల్లడించింది.
ఈ నేపథ్యంలొనే జగన్ సర్కార్ పెన్నులు, పేపర్లు, ఇతర స్టేషనరీ వస్తువుల కోసం 9.84 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా పేర్కోంది. దీంతో ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
"ప్రజల వ్యక్తిగత ఆస్తుల మీద తన పేరు చెక్కుకొవడం కోసం రూ.700 కోట్లు, ప్రభుత్వ ఆసులకు పార్టీ రంగులు వేయడానికి రూ.1,300 కోట్లు.. సాక్షి పేపర్ కోసం రూ.420 కోట్లు.. అబ్బో! అసలు ప్రజాధనాన్ని ఇంతగా దుర్వినియోగం చేసినోడు చరిత్రలో లేడనుకుంటా!" అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది టీడీపీ.
ఇదే సమయంలో... పెన్ను, పేపర్ ఖర్చు రూ.9.84 కోట్లు.. ఇంటి చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ కోసం రూ.12.85 కోట్లు.. ఎగ్ పఫ్ ల ఖర్చు రూ.3.62 కోట్లు.. ఇంటి ముందు రోడ్డు వేయడానికి రూ.5 కోట్లు.. ఎలుకలు పట్టడానికి రూ.1.36 కోట్లు.. ప్రహారీ గోడకు రూ.10 కోట్లు.. 986 మంది సెక్యూరిటీకి రూ.1000 కోట్లు అంటూ ఓ పోస్టర్ ను పోస్ట్ చేసింది.
దీంతో... ఇలా 2014-19 నాటి ఖర్చుల వివరాలు వైసీపీ.. 2019-2024 నాటి ఖర్చుల వివరాలు టీడీపీ లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టుకోవడం కంటే... ఇప్పుడు అధికారంలో ఉన్నవారైనా.. ఇలాంటి వాటిపై చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలుంటుందో ఆ మేరకు చర్యలు తీసుకోవాలని.. ప్రజాధనం అంటే పాలకులకు చిన్నచూపు తగదనే సంకేతాలు పంపాలని కోరుతున్నారు నెటిజన్లు.
అలా కానిపక్షంలో... ఎన్నో వేల సోషల్ మీడియా పోస్టులు, వందల ఆరోపణల మాదిరిగానే ఇది కూడా ఓ పొలిటికల్ స్టంట్ లా మిగిలిపోతుందని చెబుతున్నారు. యాక్షన్ తీసుకోవడానికి అన్ని హక్కులూ ఉన్న కూటమి సర్కార్ ఈ విషయాలను ఉపేక్షించరాదని నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు.