Begin typing your search above and press return to search.

టీడీపీ పొలిట్ బ్యూరోలో వారు కనిపించరా ?

టీడీపీలో అత్యున్నత రాజకీయ విధాన మండలిగా పొలిట్ బ్యూరో వ్యవస్థ ఉంది. ఇది అత్యంత బలమైనది.

By:  Tupaki Desk   |   22 Jan 2025 3:52 AM GMT
టీడీపీ పొలిట్ బ్యూరోలో వారు కనిపించరా ?
X

టీడీపీలో అత్యున్నత రాజకీయ విధాన మండలిగా పొలిట్ బ్యూరో వ్యవస్థ ఉంది. ఇది అత్యంత బలమైనది. శక్తివంతమైనది. పార్టీ తీసుకునే కీలక నిర్ణయాలు అన్నీ కూడా పొలిట్ బ్యూరోలోనే చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. అదే పార్టీ విధానంగా మారుతుంది. అలాంటి పొలిట్ బ్యూరోలో మెంబర్ షిప్ అంటే అది ఎంతో గౌరవంగా భావిస్తారు.

టీడీపీలో తలపండిన రాజకీయ నేతలు అంతా పొలిట్ బ్యూరోలో ఉంటారు. టీడీపీలో సీనియర్లు మాత్రమే లేరు, సూపర్ సీనియర్లూ ఉన్నారు. అంటే వీరంతా ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కొనసాగుతున్న వారు. వారందరూ పొలిట్ బ్యూరోలో ఆటోమేటిక్ గా మెంబర్ షిప్ తో కంటిన్యూ అవుతున్నారు.

టీడీపీ పొలిట్ బ్యూరో అనగానే కొందరి నాయకుల పేర్లు ఠక్కున గుర్తుకు వస్తాయి. వారే పార్టీ విధానాలను అక్కడ నిర్ణయిస్తూ పెద్దరికం చాటుకుంటూ ఉంటున్నారు. వారు దశాబ్దాలుగా పొలిట్ బ్యూరో మెంబర్ గా వ్యవహరిస్తూ పార్టీ అంటే తాము అన్నట్లుగానే ఉంటున్నారు.

ఇక టీడీపీలో సూపర్ సీనియర్లు సీనియర్ల ప్లేస్ లో కొత్త వారికి చాన్స్ ఇవ్వడం ద్వారా పొలిట్ బ్యూరోని సమూలంగా ప్రక్షాళన చేయాలని టీడీపీ హై కమాండ్ ఆలోచిస్తోంది అని అంటున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరోలో పూర్తిగా యువ రక్తాన్ని నింపాలని చూస్తోంది అని అంటున్నారు. అక్కడ సగటు వయసు యాభైకి మించకుండా చూడాలని అలాగే ఎక్కువ మందిని యువతరం నేతలను పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడం ద్వారా పార్టీని భవిష్యత్తు తరాలకు కనెక్ట్ చేయాలన్న మాస్టర్ ప్లాన్ తో ఉన్నారని అంటున్నారు.

ఇలా చేయడం వల్ల పార్టీకి ఫ్రెష్ లుక్ వస్తుందని ఆలోచన కూడా మారుతాయని మరింతకాలం పార్టీ మనగలిగేలా బెటర్ అండ్ బెస్ట్ ఆలోచనలు పొలిట్ బ్యూరో ద్వారా వస్తాయని అంటున్నారు. మరి పొలిట్ బ్యూరోలో మొదటి నుంచి ఉంటున్న పాత వారు పెద్ద తలకాయల సంగతేమిటి అంటే ఇక వారికి రెస్ట్ అని అంటున్నారు. చాలా మంది సీనియర్లు ఏడు పదులు దాటిన వారు పొలిట్ బ్యూరోలో మెంబర్స్ గా ఉన్నారు.

వీరంతా ఇక మీదట మాజీలు కావాల్సిందే అని అంటున్నారు. పార్టీ 1982లో ఏర్పాటు అయింది. ఈ ఏడాది మార్చి 29 నాటికి అక్షరాలా 43 ఏళ్ళ వయసు నిండుతుంది. మరో నలభై ఏళ్ళ పాటు పార్టీ మనుగడ సాగించాలీ అంటే ఈ కీలకమైన మార్పులు తప్పనిసరి అని అంటున్నారు.

ఇవన్నీ ఎపుడు చేస్తారు అంటే ఈ ఏడాది టీడీపీ మహానాడు జరగనుంది. మే 27, 28 తేదీలలో జరిగే మహానాడులో పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఆ తరువాత పొలిట్ బ్యూరో పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేస్తారని ఎవరూ ఊహించని పేర్లతో కూడా పొలిట్ బ్యూరో ఏర్పాటు అవుతుందని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.