'మంచు' ఫ్యామిలీలో మాజీ మంత్రి వేలు?
ప్రస్తుతం రచ్చకెక్కిన నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదాలపై కర్నూలు జిల్లాలో చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 10 Dec 2024 11:30 AM GMTప్రస్తుతం రచ్చకెక్కిన నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదాలపై కర్నూలు జిల్లాలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి సినీ రంగానికి చెందిన మోహన్‌బాబు కుటుంబ వివాదంపై ఇండస్ట్రీలో చర్చ జరగాలి. అయితే.. అనూహ్యంగా కర్నూలులో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.ఇప్పటి వరకు మంచు కుటుంబం ఉమ్మడిగానే ఉంటోంది. మోహన్‌బాబు, ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తె కలిసి ఉంటున్నారు. ఒకే పొయ్యి.. ఒకే ఇల్లు కాన్సెప్టుతో మోహన్‌బాబు కుటుంబం నివసిస్తోంది.
సినిమాలు, షూటింగులు ఉన్నా.. ఇంటి నుంచే అందరూ.. వెళ్తారు. వస్తారు. చెన్నై, తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు సహా.. పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున నివాసాలు కూడా ఉన్నాయి. అలాంటి కుటుంబంలో తొలిసారి ఆస్తుల వివాదం తెరమీదికి వచ్చింది. గతంలో ఎప్పుడూ.. ఆస్తుల కోసం వివాదాలు పడకపోవడం.. ఇప్పుడు వివాదాలు రోడ్డెక్కడం.. ఆసక్తిగా మారాయి. మంచు మనోజ్.. తనపై భౌతిక దాడి జరిగిందని ఆరోపిస్తూ.. తండ్రిపై ఫిర్యాదు చేశారు.
ఇక, తనకు భద్రత లేకుండా పోయిందని, తన ఆస్తులను కూడా కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని మోహన్‌బాబు ఎదురు ఫిర్యాదు చేశారు. కట్ చేస్తే.. అసలు ఈ వివాదానికి ఆళ్లగడ్డ కేంద్రంగా చోటు చేసు కున్న అంశాలు ఉన్నాయన్నది టాలీవుడ్ టాక్. భూమా మౌనికరెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్న మంచు మనోజ్.. ఇటీవలే తండ్రి అయ్యారు. అయితే.. కర్నూలు కేంద్రంగా వ్యాపారాలు చేయాలని.. దీనికి సంబంధించి ఆస్తులు పంచుకోవాలన్న ప్రతిపాదన మాజీ మంత్రిగా ఉన్న ఒకరు.. తెరమీదికి తెచ్చారని అంటున్నారు.
ఈ క్రమంలోనే తొలిసారి ఆస్తుల పంపకంపై ఏడాది కిందటే ఒక ప్రతిపాదన రాగా.. మోహన్‌బాబు తిరస్కరించారు. కానీ, భూమా మౌనిక మాత్రం.. సొంత వ్యాపారాల వైపే మొగ్గు చూపుతున్నారు. పైగా మంచు విష్ణు.. మనోజ్‌ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఆస్తులు తీసుకోకపోతే.. మున్ముందు కష్టమన్న భావన ఉంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఒకరు చక్రం తిప్పుతూ.. ఆస్తుల పంపకాలకు ప్రోత్సహిస్తున్నారని కర్నూలు జిల్లాలో చర్చ జరుగుతుండడం గమనార్హం. అయితే.. ఇది ఎంత వరకు వాస్తవంఅన్నది మున్మందు తెలియాల్సి ఉంది.